భారతదేశం
ఓయి-లింగారెడ్డి గజ్జల
<!--
--> <!-- -->దేశంలోని మతపరమైన ప్రదేశాల్లో మహిళల ప్రవేశంపై కొనసాగుతున్న వివాదాలకు ముగింపు పలికే దిశగా భారత అత్యున్నత న్యాయస్థానం మరో కీలక అడుగు వేసింది. శబరిమల ఆలయ ప్రవేశం మాత్రమే కాకుండా, ముస్లిం, పార్శీ, దావూదీ బోహ్రా వర్గాల్లో మహిళల హక్కులకు సంబంధించిన పలు సున్నితమైన అంశాలను ఒకే వేదికపై విచారించేందుకు సుప్రీంకోర్టు సిద్ధమైంది. ప్రత్యేకంగా తొమ్మిది మంది న్యాయమూర్తులతో కూడిన భారీ రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేయనుంది.
సుప్రీం కోర్ట్ ప్రకటించిన వివరాల ప్రకారం, ఈ చరిత్రాత్మక విచారణ 2026 ఏప్రిల్ 7న ప్రారంభమై ఏప్రిల్ 22న ముగియనుంది. ఉదయం 10.30 గంటలకు విచారణ ప్రారంభం. మార్చి 14లోపు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, ఆలయ నిర్వాహకులు తమ లితపూర్వక నివేదికలను సమర్పించాలని కోర్టు ఆదేశించింది. పిటిషనర్లకు, ప్రతివాదులకు సమయపట్టిక కేటాయిస్తూ నిర్ణీత గడువు దాటకూడదని స్పష్టం చేసింది.

2018 లోని శబరిమల (Sabarimala) తీర్పు
ఈ కేసుల నేపథ్యం 2018లోని శబరిమల తీర్పు వరకు వెళ్తుంది. కేరళలోని శబరిమల ఆలయంలో అన్ని వయసుల మహిళలకు ప్రవేశం కల్పిస్తూ అప్పట్లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. ఆ తీర్పును సవాలు చేస్తూ దాఖలైన 67 విచారణ పునఃపరిశీలన పిటిషన్లపై సమగ్ర అవసరమని కోర్టు భావించింది. 2019లో అప్పటి ప్రధాన న్యాయమూర్తి ఎస్.ఏ. బోబ్డే తొమ్మిది మంది న్యాయమూర్తులతో ధర్మాసనాన్ని ఏర్పాటు చేసినప్పటికీ, కోవిడ్ కారణంగా విచారణలు వాయిదా పడ్డాయి. దాదాపు ఐదేళ్ల తర్వాత ఈ అంశం మళ్లీ పూర్తి స్థాయిలో విచారణకు రానుంది.
శబరిమలకే పరిమితం కావు
ప్రస్తుతం విచారణలో ఉండబోయే అంశాలు శబరిమలకే పరిమితం కావు. మసీదులు, దర్గాల్లోకి ముస్లిం మహిళల ప్రవేశంపై ఉన్న పరిమితులు, అన్యమతస్థులను వివాహం చేసుకున్న పార్శి మహిళలకు ‘ఫైర్ టెంపుల్’లో ప్రవేశం కల్పించాలనే ప్రశ్న, అలాగే దావూదీ బోహ్రా కమ్యూనిటీలో అమలవుతున్న బహిష్కరణలు, మహిళా సున్తీ (FGM) వంటి శిక్షణపై సవాళ్లు కూడా ఈ ధర్మాసనం ముందుకు రానున్నాయి.
సున్నితమైన సరిహద్దును
న్యాయవర్గాల్లో ఈ విచారణను అత్యంత ప్రాధాన్యతతో చూస్తున్నారు. మతపరమైన విశ్వాసాలు ఒకవైపు, రాజ్యాంగం కల్పించిన సమానత్వ హక్కు తిరిగి .. ఈ దాని మధ్య ఉన్న సున్నితమైన సరిహద్దును కోర్టు ఎలా నిర్వచిస్తుంది అన్నది దేశ భవిష్యత్తుపై ప్రభావం చూపుతుంది. “రాజ్యాంగ నైతికత వర్సెస్ మతపరమైన ఆచారాలు” అనే పెద్ద ప్రశ్నకు ఈ ధర్మాసనం సమాధానం చెప్పాల్సి ఉంది.
మహిళల హక్కులపై మళ్లీ చర్చ..
సమాజంలో మహిళల హక్కులపై చర్చ మళ్లీ వేడెక్కే అవకాశం ఉంది. ఒకవైపు మతస్వేచ్ఛను కాపాడాలని భావించే వర్గాలు, మరొకవైపు రాజ్యాంగ హామీగా చూడాలని కోరుకునే వర్గాలు.. ఈ విచారణలో తమ వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.
న్యాయచరిత్రలో ఒక మైలురాయిగా
దాదాపు ఐదేళ్ల తర్వాత మళ్లీ దేశప్రారంభమవుతున్న ఈ న్యాయచరిత్రలో ఒక మైలురాయిగా నిలిచే అవకాశం ఉంది. ఏప్రిల్‌లో ప్రారంభమయ్యే ఈ రెండు వారాల విచారణ దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తోంది. చివరికి వెలువడే తీర్పు కేవలం శబరిమలకే కాదు, దేశంలోని అన్ని మతపరమైన ప్రదేశాల్లో మహిళల హక్కుల భవిష్యత్తును నిర్ణయించే కీలక నిర్ణయంగా మారవచ్చు.
ఆంగ్ల సారాంశం
భారతదేశ అత్యున్నత న్యాయస్థానం ఏప్రిల్‌లో తొమ్మిది మంది న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ముందు శబరిమల రివ్యూ పిటిషన్లు మరియు మహిళల ప్రవేశ కేసులను విచారించనుంది.