seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 19 March 2026, 7:31 am Digital Edition : SEEMA KIRANAM

వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! | పవన్ కళ్యాణ్‌తో భేటీ అనంతరం వైఎస్‌ఆర్‌సీపీలోకి రీ ఎంట్రీపై బాలినేని స్పష్టం చేశారు.

ఆంధ్ర ప్రదేశ్

ఓయ్-సాయి చైతన్య

<!--

--> <!--
Google Oneindia TeluguNews
-->

ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. – వైసీపీ మధ్య కొత్త రాజకీయ వ్యూహాలు తెర మీదకు వస్తున్నాయి. కూటమిని లక్ష్యంగా చేసుకుని జగన్ విమర్శల తీవ్రతను పెంచారు. అదే సమయంలో కూటమి 2029 ఎన్నికల టార్గెట్ గా కార్యాచరణ అమలవుతోంది. ఈ సమయంలోనే వైసీపీ నుంచి జనసేనలో చేరిన మాజీ మంత్రి బాలినేని వ్యవహారంపై కొంత కాలంగా రాజకీయంగా చర్చ జరుగుతోంది. జనసేనలో చేరినా గుర్తింపు లేకపోవటంతో తిరిగి వైసీపీలోకి వస్తారనే ప్రచారం.. బాలినేని స్పష్టత ఇచ్చారు.

మాజీ మంత్రి బాలినేని 2024లో వైసీపీలో ఓటమి తరువాత జనసేనలో చేరారు. ఎన్నికల ఫలితాల తరువాత ఓటింగ్.. ఈవీఎంల పైన అభ్యంతరాలు వ్యక్తం చేసారు. ఆ తరువాత పవన్ సమక్షంలో జనసేనలో చేరారు. వైసీపీ పైన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఇప్పటికే ఎంపీ సుబ్బారెడ్డితో ఉన్న విభేదాలతో బాలినేని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, జనసేనలో చేరిన తరువాత స్థానికంగా టీడీపీ ఎమ్మెల్యే తో గ్యాప్ కొనసాగుతోంది. ఈ ఒంగోలులో బాలినేని వైసీపీ స్థానంలో ఇంచార్జ్ ను జగన్ నియమించారు.

పవన్ కళ్యాణ్‌తో భేటీ అనంతరం వైఎస్‌ఆర్‌సీపీలోకి రీఎంట్రీపై బాలినేని క్లారిటీ ఇచ్చారు.

తాజాగా జరిగిన పార్టీ ఒంగోలు సమీక్షలోనూ జగన్ కీలక వ్యాఖ్యలు చేసారు. ఒంగోలు అనగానే వాసన్న విషయంలో కొన్ని ప్రశ్నలు వస్తాయి. అదే సమయంలో వాసన్నా మళ్లీ వస్తాడా అంటూ జగన్ వ్యాఖ్యానించి నట్లు తెలిసింది. దీంతో.. బాలినేని వైసీపీలోకి రీ ఎంట్రీ ఖాయమేనా అనే ప్రచారం మొదలైంది.

పవన్ తో భేటీ తరువాత బాలినేని క్లారిటీ ఇచ్చారు

కాగా, ఈ సమయంలోనే తన కొడుకుతో కలిసి బాలినేని తాజాగా డిప్యూటీ సీఎం పవన్ తో సమావేశం అయ్యారు. సుదీర్ఘంగా చర్చించారు. ఒంగోలులో పరిస్థితులను వివరించారు. ఆ తరువాత బాలినేని చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. తాను వైసీపీలో రీ ఎంట్రీ ఇస్తున్నానే ప్రచారం వేళ.. ఎక్కడా వైసీపీ పేరు ప్రస్తావన చేయకుండానే తన మనసులో మాట ఏంటో స్పష్టం చేసారు. ఈ మేరకు బాలినేని చేసిన ట్వీట్ వైరల్ గా మారింది.

ఆ ట్వీట్ లో పవన్ తో ఉన్న ఫొటోలను జత చేసిన బాలినేని..’ ఆయన మాకు ఒక నాయకుడు మాత్రమే కాదు… నమ్మకం, ఆదరణ, ఆశ్రయం..’ అని పేర్కొన్నారు. దీని ద్వారా తన కుమారుడితో కలిసి పవన్ ను కలవటం ద్వారా.. తనయుడికి రాజకీయంగా స్పష్టమైన హామీ పొందినట్లు. అందులో భాగంగా బాలినేని తాజాగా చేసిన ట్వీట్ ద్వారా పవన్ తోనే తమ రాజకీయంగా కొనసాగుతుందని స్పష్టం చేశారు.

ఆంగ్ల సారాంశం

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో భేటీ అనంతరం బాలినేని శ్రీనివాస రెడ్డి చేసిన ట్వీట్ ప్రకాశం రాజకీయాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది

Source link