భారతదేశం
-లింగారెడ్డి గజ్జల
<!--
--> <!-- -->ఓ పెట్రోల్ బంకు వద్ద క్షణికావేశం పెను ప్రమాదానికి దారితీసింది. మనిషి ప్రాణం కంటే సిగరెట్ పొగ ముఖ్యం అనుకున్నాడో లేక తనను వారించినందుకు అహం దెబ్బతిందో కానీ, ఒక యువకుడు చేసిన పనికి పెట్రోల్ పంపు అగ్నిగుండంగా మారింది. ఆ నిప్పు కణిక పెను విపత్తుగా మారే లోపే బంకు సిబ్బంది చేసిన సాహసం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
సామాన్యంగా పెట్రోల్ పంపుల వద్ద ‘నో స్మోకింగ్’ అనే బోర్డులు కనిపిస్తాయి. కానీ, ఛత్తీస్‌గఢ్‌లోని ఊర్ల ప్రాంతంలో గురువారం సాయంత్రం జరిగిన సీన్ చూస్తే ఎవరికైనా ఒళ్ళు గగుర్పొడుస్తుంది. ధర్మేంద్ర క్షత్రియ, ఇమ్రాన్ అనే ఇద్దరు వ్యక్తులు తమ బైక్‌లో పెట్రోల్ పోయించుకోవడానికి బంకుకు వచ్చారు. బైక్ ట్యాంక్ మూత తెరవగానే, ధర్మేంద్ర సిగరెట్ వెలిగించేందుకు ప్రయత్నించాడు.

హెచ్చరిస్తే.. హత్యాప్రయత్నం చేస్తావా?
అక్కడ ప్రమాదం జరుగుతుందని గమనించిన పంపు సిబ్బంది వెంటనే అతడిని వారించారు. “ఇక్కడ సిగరెట్ కాల్చవద్దు, ప్రమాదం” అని చెప్పడమే ఆ సిబ్బంది చేసిన పాపం. ఆ మాట వినగానే ధర్మేంద్రకు ఎక్కడలేని కోపం వచ్చింది. ఆగ్రహంతో ఊగిపోతూ తన చేతిలో ఉన్న లైటర్‌తో నేరుగా పెట్రోల్ వస్తున్న ‘ఫ్యూయల్ నాజిల్’ పైపుకే నిప్పు అంటించాడు.
క్షణాల్లో చెలరేగిన అగ్ని
పెట్రోల్ నాజిల్ కాబట్టి నిప్పు తగలగానే మంటలు ఒక్కసారిగా విరజిమ్మాయి. ఆ మంటలు వేగంగా బైక్ ట్యాంక్‌కు, పంపు మిషన్‌కు వ్యాపించాయి. అక్కడున్న వారంతా ప్రాణ భయంతో పరుగులు తీశారు. నిందితుల మీద కూడా మండే పెట్రోల్ పడటంతో వారు కూడా షాక్‌కు గురయ్యారు.
రాయ్‌పూర్‌లోని పెట్రోలు పంపులో ఓ వ్యక్తి నిప్పంటించాడు. విపత్తును ఆపేందుకు సిబ్బంది హడావిడి…
🚨 ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లోని సంగీతా ఫ్యూయెల్స్ వద్ద పెట్రోల్ పంప్ నాజిల్ దగ్గర ఒక వ్యక్తి నిప్పంటించుకున్న దృశ్యాలు CCTV ఫుటేజీలో ఉన్నాయి. ప్రమాదం జరగకుండా సిబ్బంది వేగంగా చర్యలు చేపట్టారు. నిందితులిద్దరినీ అరెస్టు చేశారు. pic.twitter.com/3r6ey6uFtU— కంటెంట్కికామి (@contentkikamii) ఫిబ్రవరి 20, 2026
రియల్ హీరోలు..
పెద్ద పేలుడు సంభవించి అందరూ చనిపోతారనుకున్న తరుణంలో, ఒక పంపు అటెండర్ ప్రాణాలకు తెగించి సాహసం చేశాడు. వెంటనే ఫ్యూయల్ పైపును పక్కకు లాగేసి, మెయిన్ సప్లైని నిలిపివేశాడు. మిగిలిన సిబ్బంది అగ్నిమాపక పరికరాలతో (అగ్నిమాపక పరికరాలు) క్షణాల్లో మంటలను ఆర్పేయడంతో పెను ప్రమాదం తప్పింది. లేదంటే ఆ మంటలు భూగర్భంలోని ట్యాంకులకు వ్యాపించి ఊర్ల ప్రాంతం అతలాకుతలమయ్యేది.
పోలీసుల వేట.. నిందితుల అరెస్ట్
ప్రమాదాన్ని సృష్టించి పారిపోవాలని చూసిన నిందితులిద్దరినీ సిబ్బంది పట్టుకుని పోలీసులకు అప్పగించారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి ధర్మేంద్ర, ఇమ్రాన్‌లను అరెస్ట్ చేశారు. ప్రజల భద్రతకు ముప్పు కలిగించడం, అగ్నిప్రమాదానికి కారకులవ్వడం వంటి సెక్షన్ల కింద వీరిపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు ఇన్‌స్పెక్టర్ రోహిత్ మహేల్కర్ తెలిపారు.
ఆంగ్ల సారాంశం
రాయ్‌పూర్ పెట్రోల్ పంపులో ఒక వ్యక్తి ధూమపానం చేయవద్దని హెచ్చరించిన తర్వాత ఇంధన నాజిల్‌కు నిప్పంటించిన షాకింగ్ సంఘటన. అప్రమత్తమైన సిబ్బంది భారీ విపత్తును ఎలా అడ్డుకున్నారో మరియు నిందితులపై తాజా పోలీసు చర్యను చూడండి.