భారతదేశం
ఓయ్-బొమ్మ శివకుమార్
<!--
--> <!-- -->కేరళలోని పాలక్కాడ్ జిల్లాలో షాకింగ్ ఘటన జరిగింది. ఓ ప్రైవేట్ బస్సు పాలక్కాడ్ నుంచి గురువాయూర్ వెళ్తుండగా బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఒట్టపాలెం వద్దకు రాగానే ఉన్నట్టుండి బస్సులో ముందు భాగంలో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగి వెనక వ్యాప్తి చెందాయి. దీనితో ప్రయాణికులు భయాందోళన చెందారు. ఈ సమయంలో అక్కడి నుంచి వెళ్తున్న ఓ డెలివరీ బాయ్ ప్రాణాలకు తెగించి ప్రయాణికులను కాపాడాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. డెలివరీ బాయ్ ధైర్య సాహసాలను అందరూ ప్రశంసిస్తున్నారు.
కేరళలోని పాలక్కాడ్ జిల్లాలో ఫిబ్రవరి 17 ఒట్టపాలెం వద్ద ఓ ప్రైవేట్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పాలక్కాడ్ నుంచి గురువాయూర్ వెళ్తున్న ఈ బస్సులో సడెన్ గా మంటలు వ్యాపించాయి. దానితో ముందు వైపు ఉన్న ఆటోమేటిక్ డోర్ సాంకేతిక కారణాల వల్ల జామ్ అయిపోయింది. ఈ రోజు కొద్దీ ప్రయాణికులు పొగ, మంటల మధ్య ఊపిరాడక లోపలే చిక్కుకుపోయారు.
ఇక ప్రయాణికులు ప్రాణభయంతో అరవడం. అదే సమయంలో అటుగా వెళ్తున్న ఓ డెలివరీ బాయ్ చాకచక్యంగా వ్యవహరించాడు. గట్టిగా ఫ్రంట్ డోర్ ను కాలుతో బద్దలు కొట్టాడు. అతనికి స్థానికులు కూడా తోడై సాయం చేశారు. దాంతో ప్రయాణికులు బయటకు పరుగులు తీశారు. డెలివరీ బాయ్ బస్సు డోర్ ను లాగే ప్రయత్నం చేయడం వలన అక్కడే ఉన్న ఆటో రిక్షా డ్రైవర్లు, దుకాణదారులు వెంటనే స్పందించారు. ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీశారు.

డీజిల్ పైపు పగిలిపోవడం వల్ల ఈ అగ్ని ప్రమాదం ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఇక ఘటనకు సంబంధించిన సీటీవీ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సమయస్ఫూర్తితో వ్యవహరించి ఎందరో ప్రాణాలను కాపాడిన ఆ డెలివరీ బాయ్, స్థానికులను నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.