వైరల్ వీడియో: ఛీ.. ఛీ.. ఏంనురా.. శివుడికి ప్రసాదంగా గంజాయి..! | మహాశివరాత్రి షాక్: యువకులు గంజాయిని శివుడి విగ్రహానికి ప్రసాదం – సీపీ సజ్జనార్ హెచ్చరిక!
[ad_1] తెలంగాణ ఓయ్-బొమ్మ శివకుమార్ ప్రచురించబడింది: మంగళవారం, ఫిబ్రవరి 17, 2026, 19:39 (IST) ఫిబ్రవరి 15న తెలుగు రాష్ట్రాల్లో మహా శివరాత్రి పండగను ఘనంగా నిర్వహించారు. వీధుల్లోని ఆలయాల నుంచి ప్రముఖ దేవాలయాల వరకు శివ నామస్మరణతో మోగిపోయాయి. ఊరూరా శివరాత్రి వేడుకలను భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. అయితే సోషల్ మీడియా మోజులో పడి కొందరు యువత వికృత చేష్టలు చేస్తున్నారు. తాజాగా శంషాబాద్ లోని ధర్మగిరి దేవాలయంలో కొందరు యువకులు చేసిన పని ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది....