భారతదేశం
ఓయ్-బొమ్మ శివకుమార్
<!--
--> <!-- -->చాలామంది సుదూర ప్రాంతాలకు వెళ్లేందుకు రైలు ప్రయాణాలను ఎంచుకుంటారు. టికెట్ ధరలు తక్కువ.. సౌకర్యవంతమైన ప్రయాణం కారణంగా రైలు ప్రయాణాలకు ఆసక్తి చూపిస్తారు. రైలులో ఫుడ్ అంత టేస్టీగా, ఆరోగ్యకరంగా ఉండదు. అది అందరికీ తెలిసిన విషయమే.. అందుకే చాలామంది ప్రయాణికులు తమ వెంట ఆహారాన్ని తీసుకుంటారు. ఒకట్రెండు రోజులు నిల్వ ఉండే ఆహారాన్ని తమ వెంట పట్టుకెళ్తుంటారు. రైల్వే స్టేషన్స్‌లో రైల్వే కంపార్ట్ మెంట్స్ లో దొరికే ఫుడ్ అనారోగ్యం కలిగిస్తుందని ప్రయాణికులు ఈ జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే తాజాగా ఓ ఫ్యామిలీ రైలులో శాండ్ విచ్ లు తయారు చేసుకుని తినడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

రైలు ప్రయాణంలో ఓ కుటుంబం చేసిన పని ఇప్పుడు నెట్టింట చర్చనీయాంశంగా మారింది. ఆ ఫ్యామిలీ ట్రైన్ జర్నీలో ఎంచక్కా శాండ్ విచ్ లు చేసుకుంటూ ఉంది. రైల్వే కంపార్ట్ మెంట్ లోనే ఆ ఫ్యామిలీలోని శాండ్ విచ్ లు తయారు చేసి తింటున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను దివ్య జైన్ అనే ఓ ఇన్ స్టా గ్రామ్ యూజర్ పోస్టు చేశారు.
బహిరంగ ప్రదేశాల్లో ఇలాంటి వారిని రైల్వే వారు నిషేధించాలి pic.twitter.com/m5F0XBcEfD
— రితిక్ (@ThenNowForeve) ఫిబ్రవరి 8, 2026
ఈ వీడియోలో ఆ కుటుంబ సభ్యులు వరుసగా తమ బెర్తుల్లో ఉన్నారు. శాండ్ విచ్ లు తయారు చేయడం చూస్తారు. బ్రెడ్ పై చట్నీ వేయడం, కూరగాయలను కట్ చేయడం, శాండ్ విచ్ లు తయారు చేయడం ఈ వీడియోలో చూడొచ్చు. అయితే ఈ వీడియో చూసిన నెటిజన్లు పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. చాలామంది ఎక్స్ యూజర్స్ ఈ చేష్టలను ఖండించారు. ఇది ప్రజలంతా వినియోగించే రైలు అని సొంత కిచెన్ కాదని స్పష్టం చేశారు. మరికొంత మంది మాత్రం రైల్వే స్టేషన్స్‌లో ఫుడ్ ఏమాత్రం రుచికరంగా, ఆరోగ్యకరంగా ఉండదని అందువల్ల ప్రయాణికులు ఇలాంటి ఫుడ్ సొంతంగా ప్రిపేర్ చేసుకుంటున్నారని కామెంట్స్ పెడుతున్నారు. అయితే ఈ ఘటన ఏ ప్రాంతంలో.. ఏ రైలులో జరిగిందన్న విషయం మాత్రం తెలియలేదు.