వైభవంగా సలాం బాబా గంధ మహోత్సవం..
నెల్లూరు రిపోర్టర్ సయ్యద్ మునీమ్ భాష
నెల్లూరు, ఆత్మకూరు, ఏఎస్ పేట, ఫిబ్రవరి 18, (సీమకిరణం న్యూస్) :
ఏఎస్ పేట మండల కేంద్రం కొండపై వెలసిన సలాం బాబా 31 వ గంధ మహోత్సవం బుధవారం రాత్రికి అంగరంగ వైభవంగా నిర్వహించారు. గంధ కలశమును సలాం బాబా ఇంటి నుండి సలాం బాబా మనవడు సయ్యద్ నాయబ్ తలపై ఉంచుకొని మేళ తాళాలతో, భక్తి కీర్తనలతో, ఫకీరుల జరుగులతో, బాణాసంచా కాలుస్తూ ఊరేగింపుగా గ్రామ పురవీధుల గుండా తీసుకువెళ్లి స్థానిక పెద్ద దర్గా అయినా ఖాజా నాయబ్ రసూల్ స్వాముల వారి దర్గాలో గంధ ఎక్కించి తదుపరి ఫక్రుద్దీన్ బాబా దర్గా లో గంధం ఎక్కించి, అక్కడి నుండి సలాం బాబా తండ్రి అజీస్ బాబా దర్గాలో గంధ లేపనం చేసి అనంతరం సలాం బాబా దర్గాకు చేరారు. అక్కడ ప్రత్యేక సలాములు పాడి ఫాతిహా చదివి దువా చేసి సలాం బాబా సమాధికి గంధ లేపనం చేసి భక్తులకు గంధ ప్రసాదాలు పంచిపెట్టారు. గంధం మహోత్సవం సందర్భంగా భారీ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. గంధ మహోత్సవానికి సలాం బాబా భక్తులు భారీగా హాజరయ్యారు. గంధ మహోత్సవ కార్యక్రమాలను సలాం బాబా కుమారులు సయ్యద్ ఖాజా రహమతుల్లా, సయ్యద్ గౌస్ భాషల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ముస్లిం సోదరులు ఎస్ జి ఎన్ ఫయాజ్ అహ్మద్, సయ్యద్ గులాం రసూల్, ఎండి రహమత్ అలీ, పఠాన్ ఫిరోజ్, షేక్ రహమతుల్లా తదితరులు పాల్గొన్నారు….

