seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 19 February 2026, 3:51 pm Digital Edition : SEEMA KIRANAM

వైభవంగా ఉస్తాద్ బాబా జండా ఉత్సవం..

వైభవంగా ఉస్తాద్ బాబా జండా ఉత్సవం..

 

నెల్లూరు రిపోర్టర్ సయ్యద్ మునిమ్ భాష

 

నెల్లూరు, ఆత్మకూరు, ఏఎస్ పేట, ఫిబ్రవరి 19, (సీమకిరణం న్యూస్) :

ఏఎస్ పేట మండల కేంద్రంలో వెలసి ఉన్న హజరత్ మీర్జా మహమ్మద్ హుస్సేన్ బేగ్ ఉరఫ్ ఉస్తాద్ బాబా స్వాములవారి 58వ గ్రంథ మహోత్సవ జెండా ఉత్సవాన్ని ఉర్దూ కాలమాన ప్రకారం నెలవంకను చూసి బుధవారం రాత్రికి వైభవంగా నిర్వహించారు. జెండాను ఉస్తాద్ బాబా మంజిల్ నుండి ఊరేగింపుగా ఫకీరుల జరుగులతో భక్తి కీర్తనలతో తీసుకువెళ్లి వస్తాద్ బాబా దర్గా వద్ద గల జెండా కట్టపై కట్టారు. ఈ సందర్భంగా ప్రత్యేక సలాములు పాడి దువా చేశారు. మార్చ్ 2వ తేదీ ఉర్దూ కవి సమ్మేళనం, 3వ తేదీ గంధం మహోత్సవం, 4వ తేదీ ఉరుసు, 5వ తేదీ తహలీల్ ఫతేహాలు వైభవంగా నిర్వహించనున్నట్లు దర్గా మేనేజ్మెంట్ ఎండి రహమత్ అలీ తెలిపారు. జెండా ఉత్సవ కార్యక్రమానికి స్థానిక ముస్లిం సోదరులు ఎస్ జి ఎన్ ఫయాజ్ అహ్మద్, సయ్యద్ గులాం రసూల్,షేక్ రహీం, షేక్ ఇమ్దాద్, షేక్ జంషీద్, ఎండి రవుఫ్, పి ఫిరోజ్ ,పి సందానీ, షేక్ ఖాజా రహమతుల్లా స్థానికులు భక్తులు పాల్గొన్నారు.