seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 11 May 2026, 6:12 am Digital Edition : SEEMA KIRANAM

వైద్య సేవల్లో కర్నూలు జిల్లాకు ‘A’ గ్రేడ్

వైద్య సేవల్లో కర్నూలు జిల్లాకు ‘A’ గ్రేడ్

 

కర్నూలు జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి

 

కర్నూలు ప్రతినిధి, మే 11, (సీమకిరణం న్యూస్) :

 

కర్నూలు జిల్లాలోని సెకండరీ హెల్త్ పరిధిలో గల ఆసుపత్రులలో ఏప్రిల్ 2025 నుంచి మార్చి 2026 వరకు నిర్వహించిన (HAI) హాస్పిటల్ యాక్టివిటీ ఇండికేటర్ గణనలో, నిర్దేశించిన లక్ష్యాలను చేరుకుని కర్నూలు జిల్లా సమగ్రంగా ‘A’ గ్రేడ్ సాధించిందని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. మాతా శిశు సంరక్షణ ఆసుపత్రి (ఆదోని), ప్రాంతీయ వైద్యశాల (ఎమ్మిగనూరు), సామాజిక ఆరోగ్య కేంద్రాలు (CHC) కోడుమూరు, వెల్దుర్తి, పత్తికొండ, మరియు ఆలూరు వైద్యశాలలకు ‘A’ గ్రేడ్ లభించిందని కలెక్టర్ తెలిపారు. ఓర్వకల్ సామాజిక ఆరోగ్య కేంద్రానికి ‘B’ గ్రేడ్ లభించిందన్నారు. ఓపిడ్, ఐపిడి, ప్రసవాలు, శస్త్ర చికిత్సలు, బెడ్ ఆక్యుపెన్సీ తదితర అంశాల్లో సాధించిన ఫలితాల ఆధారంగా జిల్లా ఏ గ్రేడ్ సాధించిందని కలెక్టర్ హర్షం వ్యక్తం చేశారు. ఇదే ఉత్సాహంతో పని చేస్తూ, ప్రస్తుతం ‘B’ గ్రేడ్‌లో ఉన్న ఓర్వకల్ ఆసుపత్రిని కూడా రాబోయే రోజుల్లో ‘A’ గ్రేడ్ దిశగా తీసుకెళ్లేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడతామని కలెక్టర్ స్పష్టం చేశారు. జిల్లా ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా యంత్రాంగం కృషి చేస్తుందని కలెక్టర్ తెలిపారు.