seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 23 March 2026, 10:25 am Digital Edition : SEEMA KIRANAM

వేసవిలో ఈ చల్లని ప్రాంతాలకు వెళ్తే ఆ కిక్కే వేరప్పా.. | వేసవి ఎస్కేప్ 2026: లడఖ్, తవాంగ్, స్పితి, డార్జిలింగ్, మున్నార్, కూర్గ్, షిల్లాంగ్, ఔలీ బెకాన్ ప్రదేశాలు

భారతదేశం

ఓయ్-బొమ్మ శివకుమార్

<!--

--> <!--
Google Oneindia TeluguNews
-->

వేసవి సెలవులు వచ్చేస్తున్నాయి. పిల్లలకు దాదాపు నెల రోజుల పాటు సమ్మర్ హాలీడేస్ ఉంటాయి. అయితే వేసవిలో చాలామంది వివిధ ప్రాంతాలకు టూర్ లకు వెళ్తారు. మరికొంతమంది విదేశాలకూ వెళ్తారు. ఎండల ధాటికి తట్టుకునేందుకు చాలామంది పర్యటకులు హిల్ స్టేషన్లు, మంచు కొండల్లో విహరించేందుకు ఆసక్తి చూపిస్తారు. మరి ఆ ప్రాంతాలు ఏంటి..? ఆ వివరాలు ఏంటి ఇక్కడ చూద్దాం..?

ఓవైపు ఎండలు ముదురుతున్నాయి. ఏప్రిల్, మే నెలలు రాకముందే మార్చిలోనే వేసవి ఉష్ణోగ్రతలు అధికమయ్యాయి. ఈ మండు వేసవిని తట్టుకునేందుకు చాలా మంది చల్లని ప్రదేశాలకు వెళ్తారు. అలా పర్వతాలు, అడవులు, వ్యాలీలు.. ఇలా హిమాలయ పర్వతాల నుంచి దక్షిణాదిలోని కాఫీ, టీ తోటలు, హిల్ స్టేషన్ల వరకూ చాలా పర్యటక ప్రాంతాలు పర్యటకుల్ని కనువిందు చేస్తున్నాయి.

వేసవిలో లద్దాఖ్ ప్రముఖ పర్యాటక ప్రాంతంగా నిలుస్తోంది. లద్దాఖ్ ను ల్యాండ్ ఆఫ్ హై పాసెస్ గా పిలుస్తుంటారు. లద్దాఖ్ కు లేహ్, కార్గిల్ ఉమ్మడి రాజధానులుగా ఉన్నాయి. లద్దాఖ్.. భౌగోళికంగా ప్రపంచంలోనే ఎత్తయిన ప్రదేశంగా ఉంది. ఇక్కడి ప్రసిద్ధ పాంగాంగ్ సరస్సు, నుబ్రా వ్యాలీ, ప్రపంచంలోనే ఎత్తయిన మోటరబుల్ రోడ్డు ఉన్నాయి.

అరుణాచల్ ప్రదేశ్ లోని తవాంగ్.. పర్యటకులను ఆకర్షించే అద్భుతమైన పర్యాటక ప్రాంతం. తవాంగ్ ను సూర్యుడు మొదట ఉదయించే ప్రాంతంగా చెబుతారు. ఇక్కడ ప్రపంచంలోనే రెండో అతిపెద్ద బౌద్ధమఠం నెలకొని ఉంది. ఇక్కడి నురనాంగ్ జలపాతాన్ని జంగ్ ఫాల్స్ అని కూడా పిలుస్తుంటారు.

హిమాచల్ ప్రదేశ్ లోని స్పిటి వ్యాలీ కోల్డ్ డెజర్ట్ గా పేరుగాంచింది. ఇది భారత్- టిబెట్ మధ్యలో ఉంటుంది. ఇక్కడ ప్రసిద్ధ బౌద్ధమఠం అయిన కీ మోనాస్టరీ ఉంది. ప్రపంచంలోనే ఎత్తైన ప్రదేశాలు హిక్కిం, కోమిక్, చిచం బ్రిడ్జి ఈ ప్రాంతంలో ప్రధాన ఆకర్షణగా ఉన్నాయి. అలాగే చంద్రతాల్ సరస్సు కూడా ఇక్కడ ప్రసిద్ధి చెందింది.

అలాగే వెస్ట్ బెంగాల్ లోని డార్జిలింగ్ ప్రాంతం ప్రముఖ పర్యటక ప్రాంతంగా ఉంది. ఈ ప్రాంతాన్ని క్వీన్ ఆఫ్ హిల్ స్టేషన్స్ గా పిలుస్తుంటారు. ఇక్కడి అకాల హిమపాతం, డార్జిలింగ్ కొండలు, కాంచనగంగ పర్వత శిఖరాలు కనువిందు చేస్తాయి. డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే, టైగర్ హిల్, బతాసియా లూప్ ముఖ్యమైన ప్రాంతాలుగా ఉంటాయి.

సమ్మర్ ఎస్కేప్ 2026 లడఖ్ తవాంగ్ స్పితి డార్జిలింగ్ మున్నార్ కూర్గ్ షిల్లాంగ్ ఔలి బెకాన్ ప్రదేశాలు

కేరళలోని మున్నార్.. పశ్చిమ కనుమల్లో ఉన్న అత్యంత అందమైన హిల్ స్టేషన్. ఈ ప్రాంతాన్ని సౌత్ కాశ్మీర్ గా పిలుస్తుంటారు. కేరళలో ఎండలు కనిపిస్తున్నాయి. ఇక్కడి అరుదైన నీలకురుంజి పూలు 12 ఏళ్లకు ఓసారి పూస్తుంటాయి. ఈ ప్రాంతాన్ని చూసేందుకు చాలా మంది పర్యటకులు క్యూ కడుతుంటారు. అలాగే కర్ణాటకలోని కూర్గ్, ఉత్తరాఖండ్ లోని ఔళీ, మేఘాలయాలోని షిల్లాంగ్ పర్యటక ప్రాంతాలు పర్యటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

Source link