seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 01 November 2026, 6:31 am Digital Edition : SEEMA KIRANAM

వెల్దుర్తి సర్పంచ్ అభ్యర్థిగా బొమ్మన రవి రెడ్డి ప్రకటన

వెల్దుర్తి సర్పంచ్ అభ్యర్థిగా బొమ్మన రవి రెడ్డి ప్రకటన

 

 

వెల్దుర్తి నజీర్,  నవంబర్ 01, (సీమకిరణం న్యూస్):

 

 

కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలోని వెల్దుర్తి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు బొమ్మన రవి రెడ్డి ప్రకటించారు. వెల్దుర్తిలోని తన నివాసంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత వైసీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలు గుర్తించి తనకు మద్దతు ఇవ్వాలని నాయకులు, ప్రజలను కోరారు. బొమ్మన రవి రెడ్డి గతంలో వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు. 2021లో జరిగిన పంచాయతీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో వెల్దుర్తి మండల పరిషత్ పరిధిలోని వెల్దుర్తి-2 ఎంపీటీసీ స్థానం నుంచి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. ప్రస్తుతం గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించారు.