Monday, March 2, 2026
ads
📄 ePaper
Homeజాతియంవెల్దుర్తి కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సార్వత్రిక సమ్మె విజయవంతం

వెల్దుర్తి కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సార్వత్రిక సమ్మె విజయవంతం

📰 Generate e-Paper Clip

వెల్దుర్తి కార్మిక సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె విజయవంతం

 

 ఏఐటీయూసీ & సిఐటియు 

 

 

 వెల్దుర్తి, ఫిబ్రవరి 12, (సీమకిరణం న్యూస్):

 

కేంద్ర రాష్ట్ర ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోడ్లు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా వ్యతిరేకిస్తూ గురువారం సమ్మెకు పిలుపు ఇచ్చారు. అందులో భాగంగా వెల్దుర్తి ఏఐటీయూసీ సీనియర్ నాయకుడు యేసయ్య సిఐటియు నాయకుడు రాజు ఆధ్వర్యంలో ర్యాలీగా బయలుదేరి బస్టాండ్ సర్కిల్ నుండి పంచాయతీ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ధర్నాను ఉద్దేశించి భవన నిర్మాణ జిల్లా అధ్యక్షుడు నాగమద్దయ్య మాట్లాడుతూ కేంద్రం ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోడ్లు దేశంలో ఉన్న కార్మిక కర్షకులను అణిచి వేయడానికి ప్రవేశపెట్టినవి కార్మికులు ఎలాంటి ధర్నాలు చేయకుండగా పెత్తందారుల ఎలా చెప్తే అలా వినాలి అనే విధంగా ఉన్నాయని అందువలన దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు ఈ సమ్మెకు పిలుపు ఇవ్వడం జరిగిందన్నారు. మన కార్మిక సంఘాలు తిరిగి మన హక్కులు పోరాడే వరకు ఈ పోరాటం ఆగదు అని భవన నిర్మాణ జిల్లా అధ్యక్షుడు తెలిపారు. సిపిఐ పట్టణ కార్యదర్శి ఎన్ గిరి మాట్లాడుతూ ఉచిత బస్సు ఏర్పాటు చేయడం వల్ల ఆటో కార్మికులకు లోటు ఏర్పడింది అందుకు ఆటో యూనియన్ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి తగిన ప్రత్యాయం చూపించాలని ప్రభుత్వాన్ని కోరారు. అదేవిధంగా ఆశా వర్కర్లను అంగన్వాడి వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిఐటియు కర్నూలు జిల్లా సభ్యుడు గురు శేఖర్ మాట్లాడుతూ దేశంలో ప్రవేశపెట్టిన లేబర్ కోడ్లు కార్మికులకు అణిచివేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం చూస్తుంది తిరిగి మా హక్కులు సాధించేవరకు పోరాటానికి సిద్ధంగా ఉన్నామని భవన నిర్మాణం కార్మిక సంక్షేమ బోర్డు వచ్చిన నిధులను భవన కార్మికులకు ఉపయోగించాలన్నారు. విధి విక్రయదారుల ఉన్న సమస్యలు ప్రభుత్వం వెంటనే గుర్తించి వారికి ప్రభుత్వ రుణాలు ఇవ్వవలసిందిగా గురు శేఖర్ సిఐటియు జిల్లా కమిటీ సభ్యుడు ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి మండల అధ్యక్షుడు బి మాధవస్వామి కోకిలనాగరాజు దేవరాజు సుధాకర్ చంద్రశేఖర అప్ప బాలు. రాజు భవన నిర్మాణ కార్యదర్శి రామాంజనేయులు. చిన్న వ్యాపారస్తుల సంఘం నాయకులు కే రామాంజనేయులు, అనిల్, ఏపీ ఆటో వర్కర్స్ యూనియన్ కర్నూల్ స్టాండ్ వెల్దుర్తి మినీ ఆటో స్టాండ్ రత్నపల్లె పుల్లగుమ్మి బోయినపల్లె కర్నూలు బొమ్మిరెడ్డి పల్లె పుల్లగుమ్మి కృష్ణగిరి చెరుకులపాడు వివిధ ఆటో స్టాండ్ కార్మికులు ఏఐటీయూసీ నాయకులు . సిఐటియు నాయకులు మండల కార్యదర్శి రాజు హమాలి మారన్న మహేష్ ఆశా వర్కర్స్ అలివేలు గీత చంద్రకళ మొదలగు కార్మికులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular