seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 07 November 2026, 11:47 am Digital Edition : SEEMA KIRANAM

వెల్దుర్తి ఎంపీటీసీ–1లో స్వతంత్ర అభ్యర్థి గుండ్రాతి సుధాకర్ గౌడ్ ఘనవిజయం!

వెల్దుర్తి ఎంపీటీసీ–1లో స్వతంత్ర అభ్యర్థి గుండ్రాతి సుధాకర్ గౌడ్ ఘనవిజయం!

 

భారీ మెజారిటీతో విజయకేతనం.. 1,266 ఓట్లతో తిరుగులేని ఆధిక్యం

 

వెల్దుర్తి, నవంబర్ 7 (సీమకిరణం న్యూస్):

 

కర్నూలు జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని ఎంపీటీసీ–1 స్థానానికి నిర్వహించిన ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి గుండ్రాతి సుధాకర్ గౌడ్ ఘనవిజయం సాధించారు. ప్రత్యర్థి అభ్యర్థులపై భారీ ఆధిక్యాన్ని కనబరిచి విజయకేతనం ఎగురవేశారు. ఈ ఎన్నికల్లో జనసేన, బీఎస్పీ, స్వతంత్ర అభ్యర్థుల మధ్య పోటీ నెలకొంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో జనసేన, బీఎస్పీ అభ్యర్థులకు ఒక్కొక్క ఓటు రాగా, స్వతంత్ర అభ్యర్థి గుండ్రాతి సుధాకర్ గౌడ్‌కు రెండు ఓట్లు లభించాయి. ఎన్నికల తుది ఫలితాల్లో స్వతంత్ర అభ్యర్థి గుండ్రాతి సుధాకర్ గౌడ్‌కు 1,266 ఓట్లు, బీఎస్పీ అభ్యర్థికి 260 ఓట్లు, జనసేన అభ్యర్థికి 208 ఓట్లు పోలయ్యాయి. దీంతో ప్రత్యర్థులపై భారీ ఆధిక్యంతో గుండ్రాతి సుధాకర్ గౌడ్ విజయం సాధించారు. ఈ సందర్భంగా తన విజయానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ గుండ్రాతి సుధాకర్ గౌడ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తనపై నమ్మకంతో ఓట్లు వేసి గెలిపించిన ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, ప్రజల సమస్యల పరిష్కారంతో పాటు వెల్దుర్తి అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని పేర్కొన్నారు.