వెల్దుర్తి అభివృద్ధికి అవకాశం ఇవ్వండి.. సమస్యలన్నీ పరిష్కరిస్తా!
సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ప్రముఖ వ్యాపారవేత్త రమేష్ శెట్టి
వెల్దుర్తి నజీర్, నవంబర్ 01, (సీమకిరణం న్యూస్):
వెల్దుర్తి గ్రామ అభివృద్ధే లక్ష్యంగా సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు ప్రముఖ వ్యాపారవేత్త రమేష్ శెట్టి ప్రకటించారు. వెల్దుర్తిలోని తన నివాసంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గ్రామంలో అనేక సమస్యలు ఉన్నాయని, తనకు ఒకసారి అవకాశం కల్పిస్తే వాటిని పరిష్కరించి అభివృద్ధి చేసి చూపిస్తానని తెలిపారు. తమకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని, ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నట్లు వెల్లడించారు. ఈసారి సర్పంచ్ స్థానం ఓసీకి కేటాయించడంతో పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. గతంలో తన తండ్రి సర్పంచ్‌గా పనిచేశారని గుర్తుచేశారు. వెల్దుర్తిలో ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్ బస్సులు గ్రామంలోకి రాకుండా హైవే మీదుగా వెళ్తున్నాయని, పాత బస్టాండ్ ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలు ఉన్నాయని పేర్కొన్నారు. తాను సర్పంచ్‌గా ఎన్నికైతే ఈ సమస్యలతో పాటు గ్రామంలోని ఇతర సమస్యలన్నింటినీ పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మాజీ మంత్రి టీజీ వెంకటేశ్, టీజీ భరత్‌ల సహకారం తనకు ఉందని, తాను సర్పంచ్‌గా పోటీ చేస్తున్న విషయాన్ని వారికి కూడా తెలియజేసినట్లు రమేష్ శెట్టి వివరించారు. గ్రామ ప్రజలు తనకు ఒకసారి అవకాశం ఇచ్చి ఆశీర్వదించాలని కోరారు.