seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 19 February 2026, 3:22 pm Digital Edition : SEEMA KIRANAM

వెల్దుర్తిలో ముస్లిం సోదరుల ప్రత్యేక ప్రార్థనలు

నెలవంక దర్శనం

 

పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం.. 

 

వెల్దుర్తిలో ముస్లిం సోదరుల ప్రత్యేక ప్రార్థనలు

 

ఈ నెల 19 నుండి పవిత్ర రమజాన్ ఉపవాస దీక్షలు ఆరంభం…

 

వెల్దుర్తి, ఫిబ్రవరి 19, (సీమకిరణం న్యూస్) : 

 

ముస్లింలు అత్యంత పవిత్రంగా భావించే రంజాన్ మాసం ఈ నెల 19 నుండి ప్రారంభం అయ్యింది. ఈ నెల 18 బుధవారం సాయంత్రం చంద్ర దర్శనంతో ఈ పవిత్ర నెల ఆరంభం అయ్యింది. బుధవారం రాత్రి ఈషా నమాజ్ తరవాత తరావీహ్ నమాజ్ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ నెల 19 గురువారం తెల్లవారుజామున తొలి ఉపవాస దీక్ష ఆరభించారు. తెల్లవారు జామున నుండి సూర్య అస్తమయం వరకు దీక్ష చేస్తారు. ప్రతి రోజూ రాత్రి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. ఇలా నెల రోజుల పాటు ఉపవాస దీక్షలు కొనసాగుతాయి. వచ్చే నెల చంద్రదర్శనం తరవాతి రోజు రంజాన్ పండుగ ఈదుల్ ఫితర్ నిర్వహిస్తారు. ఈ నెల రోజుల ముస్లింలు అత్యంత భక్తి శ్రద్ధలతో ఉపవాసం ఆచరిస్తారు. దాన ధర్మాలు చేస్తారు. బీదలకు వస్త్రాలు, భోజనాలు ఏర్పాటు చేస్తారు. ధనవంతులు తమ సంపాదనలో రెండున్నర శాతం సొమ్ములు పేదలకు జకాత్ దానం చేస్తారు.

 

వెల్దుర్తిలో ముస్లిం సోదరుల తరావీహ్ (రాత్రి ప్రార్థనలు) ప్రత్యేక ప్రార్థనలు

 

రంజాన్ మాసంలో మసీదులు ఆధ్యాత్మిక శోభతో కళకళలాడుతున్నాయి. ఈ మాసంలో మసీదులలో తరావీహ్ అని పిలిచే ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. ఈ ప్రార్థనల సమయంలో పవిత్ర ఖురాన్ మొత్తాన్ని పారాయణం చేస్తారు. వెల్దుర్తిలోని 14వ వార్డులో ఉన్న మదీనా మజీద్ లో తరావీహ్ (రాత్రి ప్రార్థనలు) ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అలాగే వెల్దుర్తి జామియా మసీదులో కూడా తరావీహ్ (రాత్రి ప్రార్థనలు) ప్రత్యేక ప్రార్థనలు చేశారు. జామియా మసీదులో ( పెద్ద మసీదు) నెల రోజులు ఉపవాసం చేసే వారికి (షెహరి) ప్రతిరోజు భోజనం సౌకర్యం కల్పించారు. ఉదయం 4 నుండి 5 వరకు ప్రతిరోజు భోజనం సౌకర్యం ఉంటుందని మసీదు పెద్దలు తెలిపారు.