భారతదేశం
oi-డాక్టర్ వీణా శ్రీనివాస్
తమిళనాడు రాజకీయాలు వేడెక్కుతున్నాయి. రాబోయే శాసనసభ ఎన్నికల్లో తమిళగ వెట్రి కళగం పార్టీ పైన ఆసక్తికర చర్చ జరుగుతుంది. సినిమాలలో తనదంటూ వచ్చిన సంపాదించుకుని రాజకీయంగా ముందుకు విజయ్ పార్టీ పైన ఇప్పటికే ప్రత్యర్ధులు దాడి చేస్తున్న వేళ, ముఖ్యంగా డిఎంకె విజయ్ రాజకీయాన్ని సవాల్ గా తీసుకుని ఎన్నికలలో గట్టి గుణపాఠం చెప్పాలని కోరుకుంటున్న వేళ విజయ్ పోటీ చేసే నియోజకవర్గం అన్న ఆసక్తికరచర్చ జరుగుతుంది.
అక్కడ పోటీకి విజయ్ పరిశీలన
మరో వైపు విజయ్ కూడా వియ్యం పేరు మీద ప్రత్యేక సెంటిమెంట్ ఉండటంతో వి స్టార్ట్ అయ్యే నియోజకవర్గాలలో పోటీకి సంబంధించి ప్రధానంగా కనిపిస్తున్నట్లుగా ఉంది. వి అక్షరం ఉన్న నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే గెలుపు తధ్యమని విజయ్‌కి ఒక జ్యోతిష్యుడు సూచించారని ఇప్పుడు ప్రస్తుతం తమిళనాట చర్చ జరుగుతుంది. విరుగంబాక్కం, వేళ్ళచ్చేరి, విక్రంవాడి, వేదారణ్యం, వేద సంతూర్ నియోజకవర్గాలను విజయ్ చేస్తున్న దృశ్యాలు.

ఆ నియోజకవర్గాలలో దేనికదే ప్రత్యేకం
ఈ ప్రాంతాల్లో విజయ్ కు అభిమానుల బలం ఉండటంతో పాటు, రాజకీయంగా కూడా అనుకూల పరిస్థితులు ఉన్నాయని సమాచారం. విరుగంబాక్కంలో విజయ్ తల్లిదండ్రులు నివసిస్తుండగా , పనైయూర్ నివాసానికి, పార్టీ కార్యాలయానికి వేళచ్చేరి కొద్ది దూరంలోనే ఉంది. ఇక టీవీకే తొలి రాజకీయ మహానాడు జరిగిన ప్రాంతం విక్రమ్ వాది కావడం, అక్కడినుండే విజయ్ తన రాజకీయ లక్ష్యాలను, పార్టీ విధానాలను ప్రకటించడం కూడా ఈ స్థానంపై ఆసక్తి రేకెత్తిస్తుంది.
విజయ్ ను ఓడించాలని డీఎంకే ప్లాన్
అయితే విజయ్ ఇప్పటివరకు తన పోటీచేసే నియోజకవర్గం పైన అధికారికంగా ఎటువంటి ప్రకటన వెల్లడించలేదు. అయినప్పటికీ వీ సెంటిమెంట్ చుట్టూ ఈ చర్చలు సాగుతున్నాయి. ఇవి తమిళనాడు రాజకీయాలలో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఇక విజయ్ పోటీ చేసే నియోజకవర్గాన్ని తెలుసుకొని, అక్కడ విజయ్ ను ఓడించాలని డీఎంకే అనుకుంటోంది.
ఎక్కడ పోటీలో ఉంటారో సస్పెన్స్
ఆయన పోటీ చేసే నియోజకవర్గంలో తమ పార్టీ అభ్యర్థిని రంగంలోకి దించాలని, భారీ మెజారిటీతో రాజకీయాలలో విజయ్ కు బలమైన దెబ్బ కొట్టాలని డీఎంకే ఆలోచిస్తోంది. అయితే విజయ్ ఏ స్థానం నుంచి పోటీ చేస్తారనే విషయాన్ని ముందుగా వెల్లడించాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఏది ఏమైనా తమిళనాడు విజయ్ రాజకీయాలతో ఈసారి అసెంబ్లీ ఎన్నికలు కొత్త రూపాన్ని తీసుకోబోతున్నాయి.

