వి.హెచ్.పి రాష్ట్ర అధ్యక్షుడు నందిరెడ్డి సాయిరెడ్డి మృతి బాధాకరం
కర్నూలు ప్రతినిధి, మే 17, (సీమకిరణం న్యూస్): విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు నంది రెడ్డి సాయిరెడ్డి మృతి ఎంతో బాధాకరం అని మాజీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్, రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ గుప్తా అన్నారు. కర్నూలోని ఏ.క్యాంపులో ఉన్న నందిరెడ్డి సాయిరెడ్డి ఇంటి వద్ద ఆయన పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. సాయిరెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఆయన చేసిన సేవలు స్మరించుకున్నారు.