seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 12 July 2026, 8:42 am Digital Edition : SEEMA KIRANAM

విశ్వభారతి మెడికల్ కాలేజీలో పురుగుల అన్నం కలకలం

విశ్వభారతి మెడికల్ కాలేజీలో పురుగుల అన్నం కలకలం

 

గూడూరు, జూలై 12, (సీమకిరణం న్యూస్):

 

గూడూరు మండలం పెంచికలపాడు దగ్గర గల విశ్వభారతి మెడికల్ కాలేజీలో చదువుతున్న విద్యార్థులకు కాంట్రాక్టర్ పురుగులు ఉన్న అన్నాన్ని పెడుతున్న ఘోరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. చాలా రోజుల నుంచి ఎలాంటి శుభ్రత పాటించకుండా ఆహారాన్ని తయారు చేసి కాలేజీ విద్యార్థులకు, హాస్టల్ విద్యార్థులకు వడ్డిస్తున్నారు.

విద్యార్థుల ఫిర్యాదు : కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని గమనించిన కొంతమంది హాస్టల్ విద్యార్థులు, పురుగులతో ఉన్న అన్నం ఫొటోలను తీసి పీజీ ఆర్ఎస్ (PGRS) కు ఫిర్యాదు చేశారు.

అధికారుల తనిఖీ: ఈ కంప్లైంట్ ఆధారంగా ఫుడ్ సేఫ్టీ అండ్ కంట్రోల్ అధికారులు కాలేజీ హాస్టల్‌లో అకస్మాత్తుగా తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో వారికి పురుగులు పట్టిన బియ్యం దర్శనమిచ్చాయి. బియ్యం సీజ్ & ల్యాబ్ పరీక్షలు: హాస్టల్ కిచెన్ లో ఉన్న సుమారు 200 కేజీల పురుగులు పట్టిన బియ్యాన్ని అధికారులు సీజ్ చేశారు. అలాగే అక్కడి ఆహార పదార్థాల శాంపిల్స్ సేకరించి, పరీక్షల నిమిత్తం చెన్నై ల్యాబ్‌కు పంపించారు.

అధికారుల వివరణ : ప్రస్తుతం ఈ విషయమై కర్నూలు జిల్లా జేసీ కోర్టులో విచారణ జరుగుతోందని, ల్యాబ్ నుండి రిపోర్టులు వచ్చాక కాంట్రాక్టర్‌పై కఠిన చర్యలు ఉంటాయని ఫుడ్ సేఫ్టీ అధికారి రాజగోపాల్ రావు స్పష్టం చేశారు.

విద్యార్థుల ఆరోగ్యంతో ఆడుకుంటూ, తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సదరు కాంట్రాక్టర్ యొక్క టెండర్/రద్దు చేసి, అతనిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విద్యార్థులు మరియు ప్రజలు డిమాండ్లు చేస్తున్నారు.