Friday, March 6, 2026
ads
📄 ePaper
Homeతెలంగాణవిశాఖ స్టేషన్లో వందే భారత్ ఎక్స్ ప్రెస్ టైమింగ్ మార్పు-రేపట్నుంచే..! | టెర్మినల్ రద్దీని తగ్గించడానికి...

విశాఖ స్టేషన్లో వందే భారత్ ఎక్స్ ప్రెస్ టైమింగ్ మార్పు-రేపట్నుంచే..! | టెర్మినల్ రద్దీని తగ్గించడానికి విశాఖపట్నం స్టేషన్‌లో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ కొత్త రాక సమయం

📰 Generate e-Paper Clip


ఆంధ్ర ప్రదేశ్

ఓయ్-సయ్యద్ అహ్మద్

తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం నడుస్తున్న వందే భారత్ ఎక్స్ ప్రెస్ (vande bharat express)రైళ్ల రాకపోకల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే నడుస్తున్న రైళ్లలో పెరుగుతున్న రద్దీ, ప్రయాణికుల డిమాండ్, స్థానిక పరిస్థితుల ఆధారంగా ఈ మార్పులు చేస్తున్నారు. వందే భారత్ రైళ్లలో గుర్తుండే వారు ఈ మార్పులను తెలుసుకుని ప్రయాణాలు చేయాలని అధికారులు కోరుతున్నారు. ఇదే తాజాగా విశాఖపట్నం స్టేషన్ కు వచ్చే ఓ వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు టైమింగ్ లో స్వల్పమార్పు జరిగింది.

ప్రస్తుతం సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నానికి నడుస్తున్న వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు నంబర్ 20707 టైమింగ్ తూర్పు కోస్తాలో రైల్వే స్వల్ప మార్పును చేపట్టింది. విశాఖపట్నం స్టేషన్‌లో అంతకంతకూ పెరిగిపోతున్న రైళ్ల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ మార్పు చేశారు. ఇప్పటిదాకా సికింద్రాబాద్ నుంచి విశాఖకు వస్తున్న వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు మధ్యాహ్నం 1.45కు వస్తుండగా… దీన్ని కాస్తా మరో ఐదు నిమిషాల టైం పొడిగించి 1.50కి వచ్చేలా మార్పు చేశారు.

టెర్మినల్ రద్దీని తగ్గించడానికి విశాఖపట్నంలో వందే భారత్ కోసం కొత్త రాక సమయం

ఈ మార్పు రేపాటి నుంచి అమల్లోకి వస్తుందని తూర్పు కోస్తా రైల్వే ఓ ప్రకటన విడుదల చేసింది. ఇది మినహా సికింద్రాబాద్-విశాఖపట్నం వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు రాకపోకల్లో ఎలాంటి మార్పులూ లేవు. ఇప్పటికే పూర్తి రద్దీతో నడుస్తున్న ఈ రైలు ప్రయాణాలకు ముందస్తుగా బుకింగ్ చేసుకోవాల్సి వస్తోంది. చివరి నిమిషాల్లో ప్రయాణాలు చేయాలంటే ఇబ్బందులు తప్పడం లేదు. అయితే విశాఖ స్టేషన్‌లో ప్రస్తుతం ఐదు నిమిషాల సమయం మార్పు ప్రభావం ప్రయాణికులపై అంతగా ఉండకపోవచ్చు. మరోవైపు విశాఖ స్టేషన్‌లో రద్దీ తగ్గుతుంది. మరోవైపు దుర్గ్ నుంచి విశాఖకు వచ్చే మరోవందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు నంబర్ 20829 టైమింగ్ లోనూ మార్పు చేశారు. మధ్యాహ్నం 1.50కు విశాఖకు రావాల్సిన ఈ రైలును ఐదు నిమిషాలు ఆలస్యంగా 1.55కు వచ్చేలా మార్చారు.





Source link

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular