ఆంధ్ర ప్రదేశ్
ఓయ్-సాయి చైతన్య
వివేకా హత్య కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. 2019 నుంచి వివేకా హత్య కేసు అనేక మలుపులు తిరిగింది. సీబీఐ సుదీర్ఘంగా విచారణ చేసింది. వివేకా కుమార్తె సునీత సుప్రీంను ఆశ్రయించారు. హైకోర్టు – సుప్రీంకోర్టులో ఈ కేసు అనేక అంశాల పైన విచారణ సాగింది. కాగా.. రెండేళ్ల విరామం తరువాత ఇప్పుడు మరోసారి సీబీఐ రంగంలోకి దిగింది. పులివెందుల కేంద్రంగా విచారణ మొదలు పెట్టింది. ఈ పరిణామం ఇప్పుడు వివేకా కేసులో బిగ్ టర్న్ గా మారుతోంది.
వివేకా హత్య కేసులో మరో సారి సీబీఐ రంగంలోకి దిగింది. సుప్రీం కోర్టు నుంచి రెండేళ్ల తర్వాత మళ్లీ సీబీఐ విచారణ ప్రారంభమైంది. తాజాగా ఈ కేసులో నిందితుడు సునీల్ యాదవ్, సాక్షిగా ఉన్న భరత్ కుమార్ యాదవ్ సోదరులు కిరణ్ యాదవ్, మహేంద్ర యాదవ్‌ను పులి వెందుల పోలీస్ స్టేషన్‌లో ప్రశ్నించారు. కొంతమంది వ్యక్తులను చంపాలని కుట్ర ఉందని సునీల్ యాదవ్ సోదరుడు కిరణ్ యాదవ్ ఆందోళన వ్యక్తం చేశారు. వివేకా హత్య చోటు చేసుకున్న రోజు తెల్లవారుజామున 1.42 గంటలకు అర్జున్ రెడ్డి అనే వ్యక్తికి కిరణ్ కుమార్ వాట్సప్ కాల్ చేశారు. వీరిద్దరి మధ్య జరిగిన ఫోన్ సంభాషణపై సీబీఐ అధికారులు ప్రశ్నించారు. అలాగే కిరణ్, మహేంద్ర మధ్య సాగిన ఫోన్ సంభాషణలపై కూడా విచారించారు. వీరిని 2 గంటల పాటు సీబీఐ అధికారి రోహిత్ యాదవ్ విచారించారు. కాల్ డేటా ఆధారంగా అనుమానితులను ప్రశ్నించి సమాధానాలు రాబట్టారు.

పులివెందులలో మకం.. వరుస విచారణలు
కాగా, ఈ కేసులో అసలు కుట్రదారులను వెలికితీయాలని సునీత దాఖలు చేసిన పిటిషన్‌పై ఆధారం గా కిరణ్ యాదవ్-అర్జున్ రెడ్డి విచారణపై విచారణ జరిపేందుకు సుప్రీం కోర్టు సీబీఐ మళ్లీ రంగంలోకి దిగింది. తాజాగా పులివెందులకు వచ్చిన సీబీఐ అధికారులు కేసులో సాక్షిగా ఉన్న యాదవ్ యాదవ్ సోదరుడు మహేంద్ర యాదవ్ భరతను ప్రశ్నించారు. కాగా.. వివేకా హత్య విషయం 2019 మార్చి 15న ఉదయం 6 గంటల 15 నిమిషాలకు పీఏ కృష్ణ ద్వారా బాహ్య ప్రపంచానికి తెలిస్తే అర్ధరాత్రి ఒకటి 42 నిమిషాలకు కిరణ్ యాదవ్ అనే వ్యక్తి అర్జున్ రెడ్డికి వాట్సాప్ మెసేజ్ పై సీబీఐ అధికారులు పేర్కొన్నారు. అంతముందు ఎలా తెలిసిందని కిరణ్ యాదవ్‌ను 2 గంటల పాటు ప్రశ్నించారు. వివేకా హత్య కేసులో తాజా పరిణామాలు చూస్తుంటే, కొందరు వ్యక్తులు తమను హత్య చేయాలని కుట్ర చేశారని కిరణ్ యాదవ్. కాగా తదుపరి విచారణలో భాగంగా సీబీఐ మరికొందరిని విచారించే అవకాశం ఉంది. కాగా.. కిరణ్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ సీబీఐ విచారణకు పూర్తిగా సహకరిస్తానని, వారడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం ఇచ్చానని చెప్పారు.

