seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 15 March 2026, 8:44 pm Digital Edition : SEEMA KIRANAM

విజయ్ చుట్టూ వల- నయానో, భయానో | NDA పొత్తు చర్చలపై విజయ్‌కి అదనపు సమయం ఇచ్చేందుకు తమిళనాడు ఓటింగ్ తేదీని వెనక్కి నెట్టారు

భారతదేశం

ఓయ్-చంద్రశేఖర్ రావు

<!--

--> <!--
Google Oneindia TeluguNews
-->

నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల తేదీలను కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఏప్రిల్ 9వ తేదీన కేరళ, అదే నెల 23వ తేదీన తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నాయి. ఒకేదశలో ఇవి ముగుస్తాయి. మే 4వ తేదీన ఓట్లను లెక్కిస్తారు. ఈ వివరాలను ఎన్నికల కమీషన్ ప్రకటించింది. ఎన్నికలు ఎదుర్కుంటున్న నాలుగు రాష్ట్రాల్లో పశ్చిమ బెంగాల్ కూడా ఉంది. ఈ రాష్ట్రంతో పాటు తమిళనాడు, కేరళ, అస్సాం, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి.

ఈ షెడ్యూల్ చేయడానికి ఈ సాయంత్రం 4 గంటలకు కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్, కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సంధు వివేక్ జోషి ఇటీవల విలేకరుల సమావేశం నిర్వహించారు. తేదీల ప్రకటనతో పాటు ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చింది. దీనితో కొత్త విధాన ప్రకటనలు లేదా ఓటర్లను ప్రభావితం చేసే ఆర్థికపరమైన వరాల గురించి వెల్లడించడానికి వీలుండదు.

NDA పొత్తు చర్చలపై విజయ్‌కి అదనపు సమయం ఇచ్చేందుకు తమిళనాడు ఓటింగ్ తేదీని వెనక్కి నెట్టారు

కాగా ఈ నాలుగు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతం కలిపి మొత్తం 824 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 17.4 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. 2.19 లక్షలకు పైగా పోలింగ్ స్టేషన్లు కేంద్ర ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేయనుంది. అలాగే- 25 లక్షల మందికి పైగా ఎన్నికల సిబ్బంది విధి నిర్వహణలో మోహరింపజేయనున్నారు. ఈ ఎన్నికలను ప్రజాస్వామ్య పండగగా అభివర్ణించారు కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్.

సాధారణంగా తమిళనాడు, కేరళ అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరుగుతాయి. ఈ సారి మాత్రం దీనికి భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. కేరళ, తమిళనాడు ఎన్నికల తేదీలను కేంద్ర ఎన్నికల కమిషన్ విడదీసింది. కేరళలో పోలింగ్ ముగిసిన తర్వాత అంటే 23వ తేదీన తమిళనాడులో ఓట్లు జరుగనుంది. ఈ రెండు రాష్ట్రాల మధ్య రెండు వారాల పాటు గడువు ఉంది. ఇది రాజకీయంగా తీవ్ర చర్చలకు దారి తీసింది.

పొత్తుపై విజయ్ తో చర్చలు కొనసాగించడానికే బీజేపీ ఈ రెండు వారాల గడువు సాధించుకున్నట్టయిందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. ఈ గడువులో టీవీకేతో పొత్తు చర్చలు ముమ్మరం చేయాలనేది బీజేపీ వ్యూహంగా భావిస్తోందని. ఎలాగైనా సరే.. ఆయనను ఒప్పించాలని పట్టుదలతో కమలనాథులు ఉన్నారనేది మరోసారి స్పష్టం.

ఇప్పటికే ఈ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే- బీజేపీ కూటమి గెలిస్తే విజయ్‌కి ఉప ముఖ్యమంత్రి పదవిని ఆఫర్ చేసినట్లు సమాచారం. దీనితో పాటు- టీవీకే సుమారు 80 అసెంబ్లీ సీట్లు ఆఫర్ చేసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. టీవీకే ఇప్పటికిప్పుడు ఎటువంటి నిర్ణయాలను తీసుకోలేదని అంటున్నారు. ఈ ప్రతిపాదనలు కార్యరూపం దాల్చితే తమిళనాడులో రాజకీయ, ఎన్నికల సమీకరణలు మారడం ఖాయం.

ఆంగ్ల సారాంశం

NDA పొత్తు చర్చలపై విజయ్‌కి అదనపు సమయం ఇచ్చేందుకు తమిళనాడు ఓటింగ్ తేదీని వెనక్కి నెట్టారు. గతసారి కేరళతో పాటు తమిళనాడు కూడా ఎన్నికలకు వెళ్లింది. ఇప్పుడు తమిళనాడు అసెంబ్లీకి ఏప్రిల్ 23న, క్రాలా ఏప్రిల్ 9న ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఒకేదశలో ఇవి ముగుస్తాయి.

Source link