Monday, March 16, 2026
ads
📄 ePaper
Homeతెలంగాణవిజయ్ కు ఇక తప్పదా, తెర వెనుక - అదే జరిగితే మొత్తం సీన్ ఛేంజ్..!!...

విజయ్ కు ఇక తప్పదా, తెర వెనుక – అదే జరిగితే మొత్తం సీన్ ఛేంజ్..!! | టీవీకే చీఫ్ విజయ్ రెండు ప్రధాన ద్రవిడ పార్టీల ఆధిపత్యానికి సవాలుగా నిలిచారు

📰 Generate e-Paper Clip


భారతదేశం

ఓయ్-సాయి చైతన్య

తమిళనాడు ఎన్నికల వేళ రాజకీయం ఆసక్తిగా మారుతోంది. కీలక సమీకరణలు చోటు చేసుకొంటున్నాయి. కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి. ఢిల్లీ మార్కు పొత్తుల పైన కీలక మంత్రాంగం సాగుతోంది. రెండు ప్రధాన కూటముల పోటీ వేళ టీవీకే – విజయ్ పాత్ర ఇప్పుడు డిసైడింగ్ ఫ్యాక్టర్‌గా రూపొందింది. దీంతో.. తెర వెనుక రాజకీయం మొదలైంది. విజయ్ చేతిలోనే నిర్ణయం పెండింగ్‌లో ఉంది. విజయ్ తన నిర్ణయం స్పష్టం చేస్తే.. ఇక నెక్స్ట్ సీఎం ఎవరనేది దాదాపు క్లారిటీ రానుంది.

తమిళనాట ఎన్నికల సమరం మొదలైంది. డీఎంకే – బీజేపీ, అన్నాడీఎంకే కూటముల మధ్య పోరు కొనసాగుతోంది. ఇదే సమయంలో సినీ హీరో విజయ్ పాత్ర ఇక్కడ కీలకంగా మారుతోంది. డీఎంకే – అన్నా డీఎంకే కూటములు.. విజయానికి మధ్య విజయ్ నిలిచారు. దీంతో.. ఇప్పుడు విజయ్ కోసం బీజేపీ అధినాయకత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే పలు రకాలుగా ఆఫర్లు ఇచ్చినట్లు ప్రచారం సాగుతోంది. అయితే, తాజా సర్వేల్లోనూ విజయ్ బలం ఏంటనేది క్లారిటీ వచ్చింది. దీంతో… విజయ్ ను తమ వైపు తిప్పుకుంటుంటే అధికారం ఖాయమనే లెక్కలు వేస్తున్నారు. విజయ్ మాత్రం గెలిచినా.. ఫలితం ఎలా ఉన్నా సింగిల్ గా పోటీ చేసేందుకు ఆసక్తి తో ఉన్నారని ఇప్పటి వరకు టీవీకే నేతలు చెబుతూ వచ్చారు. అయితే, షెడ్యూల్ వేళ తెర వెనుక రాజకీయం మొదలైంది. విజయ్ ఏ నిమిషంలో అయినా.. తమ ప్రతిపాదనలు అంగీకరించే అవకాశం లేకపోలేదని బీజేపీ నేతలు ప్రకటించారు.

tvk-చీఫ్-విజయ్-రెండు-ప్రధాన-ద్రవిడ-భాగానికి-ఆధిపత్యానికి-సవాల్‌గా-స్వయంగా-స్థానంలో ఉన్నారు

ఎన్నికల వేళ కీలక మంత్రాంగం – కొత్త లెక్కలు

దీంతో, ఇప్పుడు విజయ్ నిర్ణయం మార్చుకొని… మద్దతుగా ముందుకొస్తే మొత్తం సీన్ మారనుంది. విజయ్ సింగిల్ గా పోటీ చేయాలంటే కొన్ని సమస్యలు కనిపిస్తున్నాయి. ఈ ఎన్నికల కోసం ఇంటర్వ్యూలో ప్రస్తుతం విజయ్ అభ్యర్థులు ఉన్నారు. విజయ్ తనను తాను సీఎం అభ్యర్థిగా ప్రకటించుకున్నారు. విజయ్ నాయకత్వాన్ని అంగీకరించే ఏ కూటమితో, ఎన్నికల తర్వాత చేతులు కలిపేందుకు రెడీ అని టీవీకే పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బీజేపీ నాయకత్వం అందుకు అనుగుణంగా బీహార్ ఫార్ములా అమలుకు సిద్దం అయితే.. విజయ్ చేతులు కలిపే అవకాశం ఉంది. హీరో విజయ్‌కు ఉన్న పాపులరిటీ, యువతలో ఉన్న ఫాలోయింగ్ ప్లస్ పాయింట్‌లుగా బీజేపీ కనిపిస్తోంది. సామాజిక న్యాయం, సమ సమాజం, ద్వి భాషా విధానంపై వాదన వినిపిస్తుండటం తో పాటుగా తమిళనాడు ద్రవిడ వాదానికి అనుగుణంగా టీవీకే భావజాలం ఉండటం కలిసి వస్తుందని అంచనా వేస్తుంది బీహార్ లో తాజాగా అమలులో ఉన్న ఫార్ములాతోనే తమిళనాట బీజేపీ బరిలోకి దిగే అవకాశం ఉందనే చర్చ. అటు ఎన్నికలకు పార్టీపరంగా బలంగా లేకపోవటంతో.. విజయ్ కూడా పునరాలోచన చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. దీంతో.. ఈ వారం రాష్ట్రంలో జరిగే పరిణామాలు.. అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితం ప్రభావం చూపే అవకాశం ఉంది.



Source link

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular