విజయవాడలో టీచర్ల గర్జన.. “మా కష్టం మీద బురద చల్లొద్దు!”

మా కష్టం మాకు తెలుసు.. మా మెరిట్ మాకు తెలుసు.   మా ఉద్యోగాలపై రాజకీయాలు చేయొద్దు   విజయవాడ, ఆగస్టు 16, (సీమకిరణం న్యూస్): మెగా డీఎస్సీ-2025లో ఉద్యోగాలు సాధించిన ఉపాధ్యాయులు వైసీపీ దుష్ప్రచారంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి సుమారు 7 వేల మంది టీచర్లు విజయవాడకు తరలివచ్చి భారీ ఆత్మగౌరవ ర్యాలీ నిర్వహించారు. ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి అంబేద్కర్ స్మృతి వనం వరకు సాగిన ఈ ర్యాలీలో...