seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 17 August 2026, 2:11 pm Digital Edition : SEEMA KIRANAM

వాహన నిబంధనలు అతిక్రమిస్తే కేసులు నమోదు చేస్తాం : ఎంవిఐ రాములు

నెల్లూరు, ఆత్మకూరు, ఆగస్టు 17, (సీమకిరణం న్యూస్):

 

ఆత్మకూరు మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ ఎం.వి.ఐ ఎం.రాములు సంగం వద్ద నెల్లూరు ముంబై జాతీయ రహదారిపై వాహనాలు తనిఖీ చేశారు. సరైన పత్రాలు ఉన్నాయా వాహన ఇన్సూరెన్సులు, డ్రైవర్ల లైసెన్స్ లు ఉన్నాయా లేదా అని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వాహనదారులు తప్పనిసరిగా రహదారి భద్రతా నిబంధనలు పాటించాలని సూచించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, కార్లలో సీట్‌బెల్ట్ ధరించాలని, మద్యం సేవించి డ్రైవింగ్, సెల్‌ఫోన్ వినియోగం చేయరాదన్నారు. ఆటోల్లో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించవద్దని, ట్రాక్టర్లపై ప్రమాదకరంగా ప్రయాణించవద్దని సూచించారు. నిబంధనలు పాటించకుంటే వాహనదారులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.