seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 15 May 2026, 3:15 pm Digital Edition : SEEMA KIRANAM

వాహనాలకు నెంబర్‌ ప్లేట్‌ లేకుండా నడిపితే కఠిన చర్యలు

వాహనాలకు నెంబర్‌ ప్లేట్‌ లేకుండా నడిపితే కఠిన చర్యలు

 

వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి 

 

కర్నూలు వన్ టౌన్ సీఐ మారుతి శంకర్  

 

 

 కర్నూలు నగరంలో వాహనాల తనిఖీలు 

 

 

నంబరు ప్లేట్లు లేని వాహనాల పట్టివేత

 

 

10 వాహనాలకు జరిమానా విధించిన పోలీసులు 

 

 

కర్నూలు క్రైమ్, మే 15, (సీమకిరణం న్యూస్):

 

వాహనాలకు నెంబర్‌ ప్లేట్‌ లేకుండా నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని కర్నూలు వన్ టౌన్ సీఐ మారుతి శంకర్ హెచ్చరించారు. కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ గారి ఆదేశాల మేరకు శుక్రవారం కర్నూలు ఒన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మెయిన్ బజార్ ప్రాంతంలో కర్నూలు వన్ టౌన్ సీఐ మారుతి శంకర్ గారి ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో నంబర్ ప్లేట్లు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న 10 వాహనాలను గుర్తించి, వాటి యజమానులపై మోటార్ వాహనాల చట్టం ప్రకారం జరిమానాలు విధించారు. అనంతరం వాహనదారులతో అక్కడికక్కడే నూతన నంబర్ ప్లేట్లను ఏర్పాటు చేయించారు. నంబర్ ప్లేట్లు లేని వాహన చోదకుల వాహనాలకు సంబంధించిన పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించారు. వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, నంబర్ ప్లేట్లు లేని వాహనాలపై చట్టపరమైన చర్యలు ఉంటాయని ఈ సందర్భంగా పోలీసు అధికారులు హెచ్చరించారు.