Friday, March 6, 2026
ads
📄 ePaper
Homeతెలంగాణవాహనదారులకు బిగ్ షాక్.. మార్చి 1 నుంచి కొత్త బాదుడుకు రేవంత్ సర్కార్ రెడీ! |...

వాహనదారులకు బిగ్ షాక్.. మార్చి 1 నుంచి కొత్త బాదుడుకు రేవంత్ సర్కార్ రెడీ! | తెలంగాణలో రోడ్డు భద్రత సెస్.. మార్చి 1 నుంచి వాహనదారులకు షాక్, కొత్త వాహనాలపై 10వేల వరకు చెల్లించాలి

📰 Generate e-Paper Clip


తెలంగాణ

oi-డాక్టర్ వీణా శ్రీనివాస్

తెలంగాణా ప్రభుత్వం వాహనదారులకు బిగ్ షాక్ ఇవ్వటానికి రెడీ అయ్యింది. తెలంగాణ రాష్ట్రంలో కొత్త వాహనాలను కొనుగోలు చేసేవారికి మరో ఆర్థిక భారం వెయ్యటానికి రంగం సిద్ధం చేసింది, రోడ్డు భద్రతా సెస్ పేరుతో మరో కొత్త ఆర్థిక భారాన్ని ప్రజలపై మోపటానికి ముహూర్తం ఖరారు చేసింది తెలంగాణ ప్రభుత్వం.

కొత్త బాదుడుకు రంగం సిద్ధం చేసిన తెలంగాణా సర్కార్

కొత్త వాహనాలను కొనుగోలు చేసేవారు మార్చి 1 నుండి రోడ్ సేఫ్టీ సెస్ కూడా కట్టాల్సి ఉంటుంది. దీంతో కొత్త వాహనాలు కొనుగోలు చేసుకునే వాహనదారులకు వాహనాన్ని బట్టి 2 వేల రూపాయల నుండి 10 వేల రూపాయల వరకు రోడ్డు భద్రతా పన్ను చెల్లించాల్సి ఉంటుంది. మోటారు వాహన చట్టం ప్రకారం ఉన్న అధికారాలను బట్టి తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

మార్చి 1 నుంచి వాహనదారులకు కొత్త వాహనాలపై 10 వేల వరకు చెల్లించాల్సిన రోడ్డు భద్రత సెస్‌పై తెలంగాణ షాక్

మార్చి నుండి కొత్త వాహనాలపై రోడ్ సేఫ్టీ సెస్ ఇలా

ఈ ప్రకారం నాన్ ట్రాన్స్‌పోర్ట్ యజమానులు అదనంగా 2 వేల రూపాయల నుండి 10 వేల రూపాయల వరకు చెల్లించాల్సి ఉంటుంది. కొత్త వాహనాలు తీసుకునే సమయంలోనే ఈ అదనపు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ద్విచక్ర వాహనాలు, కార్లు, వివిధ రకాల గూడ్స్ వాహనాలు, ప్యాసింజర్ ఆటోలు ఇలా వాహనాలు ఈ సెస్ పరిధిలోకి వస్తాయి. కొత్త వాహన సమయంలోనే ఈ అదనపు పన్ను చెల్లించాలి.

2 వేల నుండి 10 వేల వరకు సెస్ వసూలు

గతంలో మూడు చక్రాల గూడ్స్ వాహనాలపై త్రైమాసిక పన్ను ఉండగా, రవాణాశాఖ ఇప్పుడు వాటిని జీవితకాల పన్ను పరిధిలోకి చేర్చింది. ఈ రోడ్డు భద్రతా పన్ను ద్విచక్ర వాహనాలకు బైక్‌లు, స్కూటీలు వంటి వాటికి రూ.2 వేలుగా నిర్ణయించారు. కార్లకు రూ.5 వేలు, గూడ్స్ వాహనాలు, 4 నుంచి 7 సీట్ల సామర్థ్యం ఉన్న ప్రయాణికుల ఆటోల వంటి ఇతర వాహనాలకు రూ.10 వేల వరకు వసూలు చేస్తారు.

వ్యవసాయ వాహనాలకు మినహాయింపు

అయితే వ్యవసాయానికి వినియోగించే ట్రాక్టర్లు, ట్రైలర్లు వాహనాలకు మాత్రం ఈ సెస్ నుండి మినహాయింపు ఇస్తుంది. ఏది ఏమైనా తెలంగాణా ప్రభుత్వం మరో కొత్త బడుకు శ్రీకారం చుట్టడం తెలంగాణా ప్రజలకు షాక్ అంటే చెప్పాలి.



Source link

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular