Tuesday, March 17, 2026
ads
📄 ePaper
Homeతెలంగాణవాహనదారులకు అదిరిపోయే శుభవార్త.. మార్చి 23 నుంచి మీ సమయం, డబ్బు ఆదా! | తెలంగాణ...

వాహనదారులకు అదిరిపోయే శుభవార్త.. మార్చి 23 నుంచి మీ సమయం, డబ్బు ఆదా! | తెలంగాణ రవాణా శాఖ ఆన్‌లైన్ సేవలను ప్రారంభిస్తూ 23 నుంచి వాహన్ పోర్టల్‌కి మారుతుంది

📰 Generate e-Paper Clip


తెలంగాణ

oi-డాక్టర్ వీణా శ్రీనివాస్

తెలంగాణ రాష్ట్రంలోని వాహనదారులకు శుభవార్త చెప్పింది తెలంగాణ రవాణా శాఖ. మార్చి 23వ తేదీ నుంచి రాష్ట్రంలో వాహనాల ప్రక్రియ కేంద్ర ప్రభుత్వ వాహనం పోర్టల్ ద్వారా జరుగుతుందని. దీనివల్ల వాహనదారులకు అనేక ప్రయోజనాలు ఉన్నాయని స్పష్టం చేసింది.

తెలంగాణ రవాణా శాఖ కేంద్ర ప్రభుత్వ వాహనం పోర్టల్ తో అనుసంధానం

ప్రస్తుతం తెలంగాణ రవాణా శాఖ తమ సొంత ఐటీ వ్యవస్థ ద్వారా వాహనదారులకు రిజిస్ట్రేషన్ ప్రక్రియకు సంబంధించిన సేవలను అందిస్తోంది. అయితే ఇప్పుడు ఇది కేంద్ర ప్రభుత్వ వాహనం పోర్టల్ తో అనుసంధానం చేయడం వల్ల రాష్ట్రంలోని వాహనాల వివరాలు జాతీయ డేటాబేస్ లోకి వెళ్తాయి. దీనివల్ల వాహనాలకు సంబంధించిన అన్ని సేవలు ఆన్‌లైన్‌లోనే అందుబాటులోకి వస్తాయి.

తెలంగాణ రవాణా శాఖ ఆన్‌లైన్ సేవలను ప్రారంభిస్తూ 23 నుంచి వాహన్ పోర్టల్‌కి మారుతుంది

రెండవ వాహనం కొనుగోలుపై అదనంగా విధించే రెండు శాతం లైఫ్ టాక్స్ రద్దు

ఆర్టిఏ లేకుండా కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉంది, ఇంట్లో ఉంచి ఆన్‌లైన్‌లో వాహనాలకు సంబంధించిన పనులను పూర్తి చేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వ అనుసంధాన వాహనాల పోర్టల్‌లోకి తెలంగాణ రవాణా శాఖ సేవల ప్రక్రియలు మారడం వల్ల ప్రజలు సులభంగా వాహన సేవలను పొందవచ్చని తెలియజేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకారం రెండవ వాహనం కొనుగోలుపై అదనంగా విధించే రెండు శాతం లైఫ్ టాక్స్ ను కూడా రద్దు చేస్తున్నారు.

జాతీయ పోర్టల్ తో అనుసంధానం వల్ల లాభమిదే

ఇది మధ్యతరగతి వాహనదారులకు భారీ ఆర్థిక ఊరటను ఇస్తుంది. 10లక్షల విలువైన కారును కొనుగోలు చేస్తే వారికి 2000 రూపాయలు ఆదా అవుతుంది. జాతీయ వాహన పోర్టల్ కు తెలంగాణ రాష్ట్ర రవాణా సేవలు మారడం వల్ల జాతీయ డేటాబేస్ తో మన రాష్ట్ర వాహనాల వివరాలు అనుసంధానం అవుతాయి. వివిధ రాష్ట్రాల్లో వాహనాల తనిఖీలు జరిగినప్పుడు లేదా వాహనాలను ఇతర రాష్ట్రాలకు విక్రయించినప్పుడు డాక్యుమెంటేషన్ ప్రక్రియ ఈజీ అవుతుంది.

ఇంట్లో కూర్చునే ఆర్టీయే సేవలు పొందే అవకాశం

దీనివల్ల ఆర్సి డూప్లికెట్ కాపీ తీసుకోవడం, పేరు మార్పు చేయడం, అడ్రస్ మార్చుకోవడం, పోతికేషన్ తొలగింపు వంటి పనులు నేరుగా ఆన్‌లైన్‌లో ఇంట్లో కూర్చోవచ్చు. ఒకటి కంటే ఎక్కువ వాహనాలు అవసరమైన కుటుంబాలకు రెండవ వాహనంపై విధించే రెండు శాతం లైఫ్ టాక్స్ రద్దు చేయడం శుభవార్తగా చెప్పొచ్చు. జాతీయ వాహన పోర్టల్ తో తెలంగాణ రవాణా వ్యవస్థ అనుసంధానం కావడం వల్ల మన రాష్ట్రంలో వాహనాలను కొనుగోలు చేయడం, మన వాహనాలను ఇతర రాష్ట్రాలకు విక్రయించడం కూడా సులభతరం చేస్తుంది.



Source link

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular