అంతర్జాతీయ
ఓయ్-చంద్రశేఖర్ రావు
<!--
--> <!-- -->ఇరాన్‌పై దాడుల అనంతరం అమెరికాలో స్థానిక పరిస్థితులు మలుపులు తిరుగుతున్నాయి. రాజధాని వాషింగ్టన్ డీసీ రీజియన్ లోని అనేక విమానాశ్రయాలలో అనూహ్య పరిణామాలు తలెత్తాయి. యుద్ధ భయాలు కొనసాగుతున్న ప్రస్తుత పరిస్థితులు చోటు చేసుకున్న ఈ ఘటనలు అమెరికన్లను ఉలిక్కిపడేలా చేసింది. అక్కడి అడ్మినిస్ట్రేషన్ ఉరుకులు పరుగులు పెట్టించింది. ఏకంగా గ్రౌండ్ స్టాప్ ను ఎత్తివేయాల్సిన వచ్చింది.
ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కార్యకలాపాలను అంతరాయాన్ని కలిగించిన రసాయన వాసన దీనికి ప్రధాన కారణం. ఈ సమస్య పరిష్కారం అయిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. రవాణా కార్యదర్శి సీన్ డఫీ ఎక్స్‌లో ఈ గుర్తింపు పొందారు. గ్రౌండ్ స్టాప్ ముగిసిందని, కార్యకలాపాలు తిరిగి పునఃప్రారంభం అయ్యాయని తెలిపారు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లకు ఎలాంటి ప్రమాదం లేదని ఫాకియర్ కౌంటీ, ప్రిన్స్ విలియం కౌంటీ అగ్నిమాపక సిబ్బంది ధృవీకరించారని తెలిపారు.

డఫీ తెలిపిన వివరాల ప్రకారం- ఈ తాత్కాలిక ఆంక్షలు రోనాల్డ్ రీగన్ వాషింగ్టన్ నేషనల్ ఎయిర్‌పోర్ట్, వాషింగ్టన్ డల్లెస్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్, బాల్టిమోర్-వాషింగ్టన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్, రిచ్‌మండ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లను తీవ్రంగా ప్రభావితం చేశాయి. కార్యకలాపాలు క్రమంగా ప్రారంభం కావడంతో.. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) ఈ ప్రాంత విమానాశ్రయాలకు హెచ్చరికను గ్రౌండ్ జాప్యాలుగా తగ్గించింది.
ముందురోజు-వాషింగ్టన్ డీసీ ప్రాంతంలోని విమాన రాకపోకల రద్దీని పర్యవేక్షించే పొటోమాక్ టెర్మినల్ రాడార్ అప్రోచ్ కంట్రోల్ ఈ రసాయనిక వాసన వెలువడింది. ఈ రీజియన్ లో ఇది అత్యంత కీలకం. వారెంటిన్, వర్జీనియాలో ఉన్న ట్రాక్ ఆన్, బాల్టిమోర్-వాషింగ్టన్, రిచ్‌మండ్-చార్లొట్టెస్విల్లే ప్రాంతాలకు ఈ పొటోమాక్ టెర్మినల్ రాడార్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సేవలు ఇక్కడి నుంచే అందుతాయి.
ఆ వాసన వెలువడిన వెంటనే గ్రౌండ్ స్టాప్ విధించారు. దర్యాప్తు చేపట్టారు. వేడెక్కిన బోర్డు నుండి వచ్చిందని పేర్కొన్నారు. దానిని మార్చేశారని డఫీ వివరించారు. ఈ బలమైన కెమికల్ వాసనకు కారణం వేడెక్కిన బోర్డు అని తేలినట్లు ఆయన చెప్పారు. దానిని మార్చారని సూచించింది. పొటోమాక్ ట్రాక్ ఆన్‌లో బలమైన రసాయన వాసన కొంతమంది ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లను ప్రభావితం చేసిందని ఎఫ్ఏఏఏ నిర్ధారించింది.
రోనాల్డ్ రీగన్, వాషింగ్టన్ డల్లెస్, టిమోర్-వాషింగ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుల వద్ద విమానాల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేయాల్సి వచ్చిందని ఏఏఏ ప్రతినిధి చెప్పారు. ఆయా విమానాశ్రయాల్లో కార్యకలాపాలు సగటున 150 నుండి 222 నిమిషాల పాటు స్తంభించిపోయాయి.
ఆంగ్ల సారాంశం
యునైటెడ్ స్టేట్స్‌లో పొటోమాక్ TRACON వాసన సమస్యను FAA పరిష్కరించే విధంగా DCA, IAD మరియు RIC వద్ద గ్రౌండ్ స్టాప్ ప్రభావం చూపుతుంది. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ మూడు విమానాశ్రయాలలో కార్యకలాపాలను ప్రభావితం చేసే Potomac TRACON నుండి వచ్చే బలమైన వాసన యొక్క మూలాన్ని పరిష్కరించడానికి కృషి చేస్తోంది. రాజధాని వాషింగ్టన్ డీసీ రీజియన్ లోని అనేక విమానాశ్రయాలలో అనూహ్య పరిణామాలు తలెత్తాయి.