తెలంగాణ
oi-డాక్టర్ వీణా శ్రీనివాస్
ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధంతో పశ్చిమాసియా దేశాలలో యుద్ధ వాతావరణం కొనసాగుతోంది. ఈ రెండు దేశాల మధ్య జరుగుతున్న భీకర యుద్ధం ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరి పైన ఒత్తిడిని కలుగజేస్తుంది. ఈ పరిణామాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఎక్కడకు తీసుకువెళతాయో అన్న ఆందోళన ప్రతి దేశంలోనూ వ్యక్తమవుతుంది.
ప్రధానికి యాంకర్ రష్మి సంచలన విజ్ఞప్తి
కేవలం ఇరాన్ ఇరాన్ ఇజ్రాయిల్ మాత్రమే కాకుండా వీరి మధ్య కొనసాగుతున్న యుద్ధ ప్రభావం యూఏఈ, ఖతార్, బహ్రయిన్, దుబాయ్ వంటి దేశాల పైన కూడా కొనసాగుతుంది. దీంతో ఆయా దేశాలలో భారతీయులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఇరాన్ ఇజ్రాయిల్ మధ్య జరుగుతున్న యుద్ధం పైన యాంకర్ రష్మి గౌతమ్ ప్రధాని నరేంద్ర మోడీకి సంచలన విజ్ఞప్తి చేశారు.

షాకింగ్ ట్వీట్ చేసిన రష్మీ గౌతమ్
ఆమె ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేస్తూ చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇంతకీ రష్మి గౌతమ్ ఏం చెప్పారంటే మన దేశం ఎప్పుడూ భిన్నత్వంలో ఏకత్వాన్ని, అన్ని మతాలను గౌరవించింది. కానీ రాడికల్ మనస్తత్వాన్ని మేము సహించం.. ఈ వ్యాధిని ఇక్కడ వ్యాపించనివ్వండి అని రష్మి తన ట్విట్టర్ ఖాతాలో రాసుకొచ్చింది.
వారిని ఇరాన్ పంపించండి.. మోదీకి విజ్ఞప్తి
అంతేకాదు రాడికల్ ఆలోచనలతో యుద్ధాన్ని సమర్థించే వాళ్ళని దయచేసి ఇరాన్ పంపాలని ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీకి విజ్ఞప్తి చేసింది. ఇలాంటి వాళ్లు ఇరాన్ వెళ్లి తమ సొంత ప్రజల కోసం పోరాడేందుకు రష్మి గౌతమ్ ప్రదర్శించారు. మన దేశంలో ఇప్పటికే నిరక్షరాస్యత, పేదరికం, కుల మొదలైన అంతర్గత సమస్యలు ఉన్నాయని గుర్తించబడింది.
మతపిచ్చితో దేశాన్ని మరింత వెనక్కి నెట్టడం ఆవేదన
వీటికి తోడు ఇప్పుడు ఈ రాడికల్ మనస్తత్వం ఉన్న వాళ్ళ మతపిచ్చితో దేశాన్ని మరింత వెనక్కి నెట్టినట్లు రష్మి గౌతమ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే సమయంలో రాడికల్ మనస్తత్వం ఉన్న దేశాలలో ఆడపిల్లలకు 9 ఏళ్లకే పెళ్లిళ్లు కానీ, తను ఒక స్వతంత్ర దేశంలో ఉంటున్నందుకు గర్వపడుతున్నానని రష్మీ గుర్తించింది.
పెళ్లిపై ఘాటుగా స్పందించిన రష్మీ
అయితే ఈ ఎవరైనా రష్మీ పెళ్లి గురించి మాట్లాడితే వారికి ఘాటుగా సమాధానం ఇచ్చింది. నేను పెళ్లి చేసుకోకుండా పిల్లల్ని కనకుండా ఉన్నా సరే నా దేశంలో పూర్తిగా గౌరవంతో, వ్యక్తితో బ్రతుకుతున్నాను అని రష్మీ గుర్తించింది. ఇక రష్మి చేసిన వ్యాఖ్యలపై కొందరు సానుకూలంగా స్పందించారు, మరికొందరు భిన్న అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

