seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 04 March 2026, 12:49 pm Digital Edition : SEEMA KIRANAM

వాళ్లను చంపేస్తాం.. యుద్ధం ఆగదు: ఇరాన్ సంచలన వార్నింగ్ | ఇరాన్ US చర్చల తాజా వరుసను తిరస్కరించింది: “చర్చలు లేవు, యుద్ధం కొనసాగుతుంది” – టెహ్రాన్ గట్టి హెచ్చరిక జారీ చేసింది

అంతర్జాతీయ

ఓయ్-బొమ్మ శివకుమార్

<!--

--> <!--
Google Oneindia TeluguNews
-->

ఇరాన్ పై ఇజ్రాయెల్- అమెరికా సంయుక్తంగా దాడులు జరిగే విషయం తెలిసిందే. శనివారం ప్రారంభమైన దాడులు రోజురోజుకూ ఉద్ధృతం అవుతూనే ఉన్నాయి. ఇజ్రాయెల్ సైన్యం.. ఇరాన్ సుప్రీం లీడ్ అయతొల్ల అలీ ఖమేనీని హతమార్చడంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తారా స్థాయికి చేరాయి. ఇరాన్ సైతం ఇజ్రాయెల్ తో పాటు గల్ఫ్ దేశాలపై దాడులకు పాల్పడుతోంది. యూఏఈ, కువైట్, ఖతార్, బహ్రెయిన్, సౌదీ అరేబియా, సైప్రాస్, ఇరాక్, జోర్డాన్ తదితర దేశాలపై క్షిపణులు, డ్రోన్లతో దాడులు జరుగుతున్నాయి.

అయితే తాజాగా యుద్ధంపై ఇరాన్ సంచలన వ్యాఖ్యలు చేసింది. అమెరికాతో చర్చలు జరపాలన్న ఆలోచనలో ఇరాన్ లేదని ఖమేనీ సన్నిహితుడు మహమ్మద్ మక్బర్ తేల్చి చెప్పారు. తమకు అవసరం ఉన్నంత కాలం మిడిల్ ఈస్ట్ లో యుద్ధం కొనసాగుతుందని తెలిపారు. ఈ మేరకు అమెరికాతో చర్చలు లేవని.. యుద్ధాన్ని కొనసాగిస్తామని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అమెరికాను తాము నమ్మలేమని తేల్చారు.

మరోవైపు ఇరాన్- ఇజ్రాయెల్ వైమానిక దాడులకు సంబంధించి సపోర్ట్ గా ఏమైనా మాట్లాడినా.. చేసినా కఠిన శిక్షలు ఉంటాయని ఇరాన్ జ్యుడిషియరీ చీఫ్ స్పష్టం చేశారు. ఇరాన్ శత్రు దేశాలకు ఏ విధంగా సహకరించినా మరణశిక్ష విధించే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం యుద్ధ సమయంలో ఇజ్రాయెల్, అమెరికాకు సహకరించిన వారికి మరణశిక్ష విధించే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఇక ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలకు ఇరాన్ ప్రభుత్వ యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. ఇరాన్ లోని మషాద్ తాజా ఖమేనీ ప్రార్థన స్థలంలోనే అంత్యక్రియలను నిర్వహించడం గురించి సమాచారం అందుతోంది. స్థానిక కాలమానం ప్రకారం బుధవారం రాత్రి 10 గంటలకు అంత్యక్రియలు ప్రారంభించినట్లు స్పష్టం చేశారు. ఈ అంత్యక్రియల కార్యక్రమం మూడు రోజుల పాటు జరగడం జరిగింది.

ఇరాన్ US చర్చలను తిరస్కరించింది తాజా వరుస చర్చలు లేవు యుద్ధం కొనసాగుతోంది టెహ్రాన్ సంస్థ హెచ్చరిక జారీ చేస్తుంది

ఇక ఇరాన్ పై ఇజ్రాయెల్- అమెరికా సంయుక్తంగా దాడులు చేపట్టిన విషయం తెలిసిందే. శనివారం ప్రారంభమైన దాడుల్లో ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికా సైన్యాలు క్షిపణులు, డ్రోన్ దాడులతో రెచ్చిపోయాయి. ఈ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మృతి చెందిన విషయం తెలిసిందే. దాంతో ఇరాన్ ప్రతీకార దాడులు జరుగుతున్నాయి. ఇజ్రాయెల్‌తోపాటు గల్ఫ్ దేశాలపై దాడులు జరుగుతున్నాయి. యూఏఈ, కువైట్, ఖతార్, బహ్రెయిన్, సౌదీ అరేబియా, సాయిప్రస్, ఇరాక్‌, జోర్డాన్‌ తదితర దేశాలపై క్షిపణులు, డ్రోన్ల వర్షం కురిపిస్తోంది.

Source link