వ్యాపారం
ఓయ్-జక్కీ మహేష్
<!--
--> <!-- -->స్టాక్ మార్కెట్ అప్‌డేట్: దేశీయ స్టాక్ మార్కెట్లు వారాంతంలో ఊహించని రీతిలో కుప్పకూలాయి. శుక్రవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి దలాల్ స్ట్రీట్‌లో అమ్మకాల సునామీ కనిపించింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి అందిన ప్రతికూల సంకేతాలకు తోడు దేశీయంగా ఐటీ రంగంలో తలెత్తిన ఆందోళనలు ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఈ భారీ పతనంతో సెన్సెక్స్ ఏకంగా 1,048 పాయింట్లు నష్టపోయి 82,626 వద్ద ముగియగా.. నిఫ్టీ 336 పాయింట్ల నష్టంతో 25,451 వద్ద స్థిరపడింది. కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే ఇన్వెస్టర్ల సంపద దాదాపు రూ.7 లక్షల కోట్లు ఆవిరైపోయింది.
ఐటీ రంగాన్ని వణికించిన ‘ఆంథ్రోపిక్ షాక్’
ఈ పతనానికి ప్రధాన కారణం ఐటీ రంగంలో తలెత్తిన ‘ఏఐ భయం’ అని విశ్లేషకులు చెబుతున్నారు. అమెరికాకు చెందిన ఐఐ స్టార్‌టాప్ ‘ఆంథ్రోపిక్’ విడుదల చేసిన కొత్త టెక్నాలజీ టూల్స్ వల్ల సంప్రదాయ ఐటీ సేవ ప్రాధాన్యత తగ్గుతుందనే ఆందోళన మొదలైంది. ఇది భారతీయ ఐటీ దిగ్గజాలపై నేరుగా ప్రభావం చూపింది. ఫలితంగా టీసీఎస్ (TCS), ఇన్ఫోసిస్ (Infosys), విప్రో (Wipro) వంటి అగ్రశ్రేణి కంపెనీల షేర్లు 5 శాతం వరకు పడిపోయి మార్కెట్ పతనానికి ప్రధానమైనవిగా నిలిచాయి.

అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల ప్రభావం
మరోవైపు అమెరికా స్టాక్ మార్కెట్లలో టెక్ షేర్లు భారీగా అమ్మకాల ఒత్తిడికి లోనవ్వడం భారత మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల తగ్గింపుపై నెలకొన్న అనిశ్చితి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో చోటుచేసుకుంటున్న మార్పులు ఇన్వెస్టర్లలో భయాందోళనలను రేకెత్తించాయి. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను భారీగా వెనక్కి తీసుకోవడం మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. ఐటీతో పాటు బ్యాంకింగ్, తాజా, రియల్ ఎస్టేట్ రంగాల్లో కూడా విచక్షణారహితంగా అమ్మకాలు జరిగాయి.
లక్షల కోట్ల సంపద ఆవిరి
మార్కెట్ పతనం కారణంగా బీఎస్‌ఈ (BSE) లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ ఒకే రోజులో రూ. 472.48 లక్షల కోట్ల నుంచి రూ. 465.31 లక్షల కోట్లకు పడిపోయింది. అంటే ఇన్వెస్టర్లు కేవలం ఒకే రోజులో దాదాపు రూ. 7 లక్షల కోట్లు నష్టపోయారు. బీఎస్‌ఈ టాప్-30 షేర్లలో కేవలం రెండు షేర్లు మినహా మిగిలిన 28 షేర్లు భారీ నష్టాల్లో ముగిశాయి. ముఖ్యంగా హిందూస్థాన్ యూనీలివర్, టాటా స్టీల్, టైటాన్ వంటి కంపెనీలు కూడా నష్టాల బాట పట్టాయి.
ఇన్వెస్టర్లు ఏం చేయాలంటే?
ప్రస్తుత ఇన్వెస్టర్లు కంగారు పడి తమ వద్ద ఉన్న షేర్లను విక్రయించకుండా మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. ఏఐ వల్ల ఐటీ రంగంలో ప్రస్తుతం వస్తున్న మార్పులు దీర్ఘకాలంలో కొత్త అవకాశాలను కూడా సృష్టించాయి. పెట్టుబడిదారులు నాణ్యమైన కంపెనీల షేర్ల కోసం వేచి చూడటం లేదా సిస్టమా ఇన్టిక్‌వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP) విధానంలో ముందుకు సాగడం మంచిదని విశ్లేషిస్తున్నారు.
ఆంగ్ల సారాంశం
ఫిబ్రవరి 13, 2026న స్టాక్ మార్కెట్ క్రాష్, సెన్సెక్స్ 1,048 పాయింట్లు క్రాష్ మరియు నిఫ్టీ 336 పాయింట్లు పడిపోయాయి. ఆంత్రోపిక్ యొక్క AI సాధనాలు మరియు గ్లోబల్ టెక్ అమ్మకాలు ఇన్వెస్టర్ల సంపదలో రూ.7 లక్షల కోట్లను ఎందుకు తుడిచిపెట్టాయో కనుగొనండి.