తెలంగాణ
oi-డాక్టర్ వీణా శ్రీనివాస్
<!--
--> <!-- -->తెలంగాణ రాష్ట్రంలో గంటల్లో మున్సిపల్, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు ఏ పార్టీ దూసుకుపోయిందో తేలనుంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బిజెపి, బీఆర్ఎస్ ఈ ఎన్నికలలో హోరాహోరీగా తలపడగా, ఈ అన్ని పార్టీలకు షాక్ ఇస్తూ తెలంగాణ జాగృతి కవిత ఇచ్చిన మద్దతుతో ఓ కొత్త పార్టీ జోగులాంబ గద్వాల జిల్లాలో మున్సిపాలిటీ పైన జెండా ఎగురేసింది.
ప్రధాన పార్టీలకు మైండ్ బ్లాంక్ అయ్యే షాక్ ఇచ్చిన కవిత
జోగులాంబ గద్వాల ఏర్పాటు వడ్డేపల్లి మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాల్లో ప్రధాన పార్టీలకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయింది. ఈ ఎన్నికల ఫలితాలలో గతంలో ఎన్నడూ లేనివిధంగా ఒక సంచలనం నమోదైంది. కాంగ్రెస్, బిజెపి, బీఆర్ఎస్ పార్టీలకు షాక్ ఇస్తూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు అయిన కవిత మద్దతుతో ఆలిగా ఫార్వర్డ్ బ్లాక్ విజయం సాధించింది.

వడ్డేపల్లి మున్సిపాలిటీలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ విజయం
వడ్డేపల్లి మున్సిపాలిటీకి సంబంధించి మొత్తం పది వార్డులకు ఎన్నికలలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ఎనిమిది వార్డులలో విజయం సాధించింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు చెరొక వార్డును పంచుకున్నాయి. దీంతో వడ్డేపల్లి మున్సిపాలిటీ ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ వశం చేసుకుంది. అయితే ఇక్కడ కవిత మద్దతు వల్లే ఇక్కడ ఈ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారన్న చర్చ.
కవిత మద్దతు ప్రకటించిన పార్టీ విజయం
ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థులు సింహం గుర్తుతో ఎన్నికలలో పోటీ చేసి విజయం సాధించడంతో పార్టీ కార్యకర్తలు వడ్డేపల్లిలో సంతోషంలో మునిగిపోయారు. మరోవైపు జాగృతి కార్యకర్తలు సైతం ఈ విజయం కవిత కారణంగానే సాధ్యమైంది అంటూ జోష్ లో ఉన్నారు.మున్సిపల్ ఎన్నికలలో ప్రత్యక్షంగా పోటీ చేయనప్పటికీ నాయకులు, మంచి నాయకులను ఎన్నుకోవాలని పిలుపునిచ్చిన కవిత వడ్డేపల్లిలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీకి తన మద్దతును ప్రకటించారు.
కవిత రాజకీయంపై చర్చ
రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ టీఆర్ఎస్ మధ్య తీవ్ర పోటీగా వడ్డేపల్లి లో జాగృతి అధ్యక్షురాలు కవిత మద్దతు ఇచ్చిన పార్టీ అభ్యర్థులకు ప్రజల విజయాన్ని కట్టబెట్టడం రాజకీయాలలో ఆసక్తికర పరిణామంగా మారింది. ఈ విజయంతో కవిత రాజకీయ అడుగుల పైన ప్రస్తుతం చర్చ జరుగుతోంది.
ఆంగ్ల సారాంశం
మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో తెలంగాణ జాగృతి కవిత మద్దతుతో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్‌తో వడ్డేపల్లి మున్సిపాలిటీ విజయం సాధించింది. ఇది brs, bjp మరియు కాంగ్రెస్‌లకు పెద్ద షాక్ ఇచ్చింది.