seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 22 March 2026, 2:04 pm Digital Edition : SEEMA KIRANAM

లష్కరే తోయిబా ఉగ్రవాది హత్య.. చంపేసింది సొంత కుటుంబ సభ్యులే! | లష్కరే తోయిబా కమాండర్ బిలాల్ ఆరిఫ్ సరాఫీని పాకిస్థాన్‌లో కుటుంబ సభ్యులు హతమార్చడంతో తీవ్రవాద బృందం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.

అంతర్జాతీయ

ఓయ్-జక్కీ మహేష్

<!--

--> <!--
Google Oneindia TeluguNews
-->

పాకిస్థాన్‌లో లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు షాక్ తగిలింది. పాక్ కేంద్రంగా పనిచేస్తున్న లష్కరే తోయిబాలో కీలక కమాండర్‌గా ఉన్న బిలాల్ ఆరిఫ్ సరాఫీ దారుణ హత్యకు పాల్పడ్డాడు. శనివారం రంజాన్ ప్రార్థనల అనంతరం ఆయన సొంత కుటుంబ సభ్యుల బిలాల్‌ను కత్తులతో పొడిచి, ఆపై తుపాకీతో కాల్చి చంపినట్లు నిఘా వర్గాలను వెల్లడించారు.

మురిడ్కేలో ఘటన.. కుటుంబ కలహాలే కారణమా?
ఈ హత్య పాకిస్థాన్‌లోని మురిడ్కే ప్రాంతంలో ఉన్న లష్కరే తోయిబా ప్రధాన కార్యాలయం సమీపంలో జరిగినట్లు సమాచారం. లష్కరే తోయిబా కమాండర్ బిలాల్ ఆరిఫ్ సరాఫీ హత్యకు గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియలేదు. అయితే ఇది కుటుంబ సభ్యుల మధ్య జరిగిన వివాదం కారణంగానే ఇంటెలిజెన్స్ వర్గాలు అనుమానిస్తున్నాయి. ఈ హత్యకు గురైన వారిని ఇప్పటికే పాక్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.

లష్కరే తోయిబా కమాండర్ బిలాల్ ఆరిఫ్ సరఫీని పాకిస్థాన్ ఉగ్ర గ్రూపులో కుటుంబ సభ్యులు హతమార్చారు.

ఫోటో క్రెడిట్: X(Twitter)

బ్రెయిన్ వాషింగ్‌లో బిలాల్ సిద్ధహస్తుడు
బిలాల్ ఆరిఫ్ సరాఫీ లష్కరే తోయిబాలో రిక్రూట్‌మెంట్ పాత్ర కీలక పాత్ర పోషించేవాడు. మురిడ్కే కేంద్రంగా యువకులను గుర్తించి.. వారిని ఉగ్రవాదం వైపు మళ్లించడం బిలాల్ ప్రధాన బాధ్యత. యువతకు భావజాల శిక్షణ ఇచ్చి.. వారిని బ్రెయిన్ వాష్ చేయడంలో బిలాల్ సిద్ధహస్తుడని నివేదికలు చెబుతున్నాయి. అయితే భారత్‌లో బిలాల్‌పై ఎలాంటి కేసులు నమోదు కాలేదు.

పాకిస్థాన్‌లో పెరుగుతున్న ఉగ్ర రిస్క్
ఒకప్పుడు ఉగ్రవాదాన్ని పెంచి పోషించిన పాకిస్థాన్.. ఇప్పుడు అదే ఉగ్రవాదం కోరల్లో చిక్కుకుపోతోంది. గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ 202 ప్రకారం.. ప్రపంచంలో ఉగ్రవాదంతో అత్యధికంగా ప్రభావితమైన దేశాల జాబితాలో పాకిస్థాన్ మొదటి స్థానంలో నిలిచింది. 2025లో పాక్‌లో మొత్తం 1,045 ఉగ్రదాదులు జరిగాయి. ఈ దాడుల్లో 1,139 మంది మరణించగా.. 1,595 మంది గాయపడ్డారు. ప్రధానం ఖైబర్ పఖ్తుంఖ్వా, బలూచిస్తాన్ దేశాల్లో 74 శాతం దాడులు జరుగుతున్నాయి.

ఆంగ్ల సారాంశం

పాకిస్థాన్‌లోని మురిద్కేలో లష్కరే తోయిబా కమాండర్ బిలాల్ ఆరిఫ్ సరాఫీని అతని కుటుంబ సభ్యులు కత్తితో పొడిచి కాల్చి చంపారు. GTI 2026లో ఈ సంఘటన మరియు పాకిస్తాన్ పెరుగుతున్న ఉగ్రవాద ప్రమాదం గురించి చదవండి.

Source link