seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 02 February 2026, 2:00 pm Digital Edition : SEEMA KIRANAM

రోడ్డు ప్రమాదాల నివారణలో పౌరుల పాత్ర అత్యంత కీలకం

రోడ్డు ప్రమాదాల నివారణలో పౌరుల పాత్ర అత్యంత కీలకం

 

ఎస్సై అనిల్ కుమార్

 

ప్యాపిలి, ఫిబ్రవరి 02, (సీమకిరణం న్యూస్) :

 

రోడ్డు ప్రమాదాల నివారణలో పౌరుల పాత్ర అత్యంత కీలకమని ఎస్సై అనిల్ కుమార్ పేర్కొన్నారు. ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు మండలంలోని జలదుర్గం పిఎస్ పరిధిలోని చిగురు మాన్ సర్కిల్ నందు సోమవారం జలదుర్గం ఎస్‌ఐ అనిల్ కుమార్ పోలీస్ సిబ్బందితో కలిసి వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వరిగడ్డి ట్రాక్టర్ వాళ్ళు రాత్రి సమయాలలో తరలించడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అందువల్ల ట్రాక్టర్లలో వరిగడ్డి తరలించేవారు ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల లోపు తరలించుకోవాలని సూచించరు. రాత్రి సమయాలలో ట్రాక్టర్ లో ఉన్న వరిగడ్డి వల్ల ఎదురుగా వచ్చే వాహనదారులకు కనిపించక ప్రమాదాలు జరిగే అవకాశలు ఎక్కువ ఉన్నాయన్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్‌ కారు నడిపేవారు సీట్‌ బెల్ట్‌ ధరించాలన్నారు. వాహనాలకు సంబంధించి తీసుకోవాలని ట్రాఫిక్‌ నియమాలు తప్పనిసరిగా పాటించాలన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపరాదని హెచ్చరించారు.