రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించేలా వైద్య సిబ్బంది చర్యలు తీసుకోవాలి
పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాం కుమార్
ఆసుపత్రిలో అదనపు గదుల నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే కేఈ శ్యామ్ కుమార్
పత్తికొండ, ఫిబ్రవరి 07, (సీమకిరణం న్యూస్):

రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించేలా వైద్య సిబ్బంది చర్యలు తీసుకోవాలని పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాం కుమార్ తెలిపారు. పత్తికొండ ప్రభుత్వ వైద్యశాల ఆవరణలో ఐదు కోట్ల 75 లక్షల రూపాయలతో నిర్మించే ఆసుపత్రి అదనపు గదులు నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే కేఈ శ్యామ్ కుమార్ అనంతరం డాక్టర్లతో సమావేశం నిర్వహించారు. రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించేలా వైద్య సిబ్బంది చర్యలు తీసుకోవాలని పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాం కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పత్తికొండ ప్రభుత్వ వైద్యశాలను చాలా శుభ్రంగా ఉంచుకున్నారని డాక్టర్లను ఆసుపత్రి సిబ్బందిని అభినందించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో మౌలిక సదుపాయాలు, టెక్నికల్ సిబ్బంది ఎంతమంది ఉన్నారు తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రభుత్వ వైద్యశాలను తనిఖీ చేసి మందులు సరఫరా గురించి అడిగి తెలుసుకున్నారు. వైద్య సేవలపై అక్కడున్న రోగులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

