తెలంగాణ
-సాయి చైతన్య
<!--
--> <!-- -->కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. రైల్వే ప్రయాణీకులకు కొత్త వరాలు ప్రకటన చేసింది. ప్రధాన అధ్యక్షతన జరిగే కేంద్ర కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో) పేరును ‘సేవతీర్థ్’గా మార్చాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే, రూ.1,60,504 కోట్ల విలువైన పనులను చేపట్టాలని కేంద్ర సర్కార్ నిర్ణయించింది. అస్సాంలో అండర్ వాటర్ రివర్ టన్నెల్ నిర్మాణానికి క్యాబినెట్ ఆమోదం విడుదల.
ఈ మంత్రివర్గ భేటీలో అనేక కీలక అంశాలపై చర్చ జరిగింది. తాజాగా కేంద్ర బడ్జెట్ తో యువత .. మౌళిక వసతుల కల్పన దిశగా ప్రాధాన్యత ఇచ్చారు. త్వరలో అయిదు రాష్ట్రాల ఎన్నికలు జరగనున్నాయి.. కేంద్రం ప్రతీ నిర్ణయం వ్యూహాత్మకంగా తీసుకుంటోంది. ఈశాన్య రాష్ట్రాల నుంచి తాజాగా వందేభారత్ స్లీపర్ ను ప్రధాని కోసం. త్వరలో దక్షిణాది రాష్ట్రాల్లోనూ వందేభారత్ స్లీపర్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. కాగా, ఈ రోజు జరిగిన మంత్రి వర్గ సమావేశంలో గోహుపూర్ – నుమాలిఘర్ మధ్య అండర్ వాటర్ రోడ్డు టన్నెల్ ఏర్పాటుకు క్యాబినెట్ ఆమోదించింది. 34 కిలోమీటర్ల మేర అండర్ వాటర్ టన్నెల్ నిర్మాణం చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. ఈ టన్నెల్ నిర్మాణంతో 34 కి 250 దూరం తగ్గనుంది. ఈ టన్నెల్ నిర్మాణం ద్వారా 6 గంటల సమయం పట్టే గమ్యం.. కేవం 20 నిమిషాల్లో చేరుకునే అవకాశం ఉంది.

హైదరాబాద్ మీదుగా కొత్త ప్రాజెక్టు
కాగా, బ్రహ్మపుత్ర నది కింద రైల్వేలైన్, నేషనల్ హైవే కోసం టన్నెల్‌ని నిర్మించనుంది. కసారా - మన్మాడ్ మూడు, నాలుగో రైల్వేలైన్ ప్రాజెక్ట్‌కు కేంద్ర క్యాబినెట్ ఆమోదం విడుదల. ఢిల్లీ – అంబాల మధ్య మూడు,నాలుగు రైల్వే లైన్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అదే విధంగా తెలంగాణ మీదుగా మరో ప్రధాన లైన్ కు ఆమోదం లభించింది. బళ్లారి – హోస్పేట మధ్య రూ.2,372 కోట్లతో మూడు, 4 రైల్వేలైన్ ఏర్పాటుకు క్యాబినెట్ ఆమోదించింది. గూడె బెల్లూరు నుంచి మహబూబ్‌నగర్ సెక్షన్ మధ్య రూ.3,175 కోట్ల ఖర్చుతో నాలుగు లైన్ల రోడ్డు నిర్మాణానికి క్యాబినెట్ ఆమోదం. మహబూబ్‌నగర్, నారాయణపేట, రాయచూర్, దేవరకద్ర, హైదరాబాద్‌కు ఈ కనెక్టివిటీ ఉంది. హైదరాబాద్ – పనాజీ కారిడార్‌లో భాగంగా కొత్త నాలుగు లైన్ల రోడ్డు నిర్మాణం చేపట్టనుంది. 80 రోడ్డు నిర్మాణానికి రూ.3175 కోట్ల ఖర్చు చేయనుంది. దమాసియా – బిటాడ నర్సాపూర్ మలోత సెక్షన్ మధ్య నాలుగు లైన్ల నిర్మాణానికి రూ.4,584 కోట్లను ఖర్చు చేయనుంది. గోతి- ట్రిమ్‌బాక్ – పాల్గర్ సెక్షన్ అబ్రిడేషన్ కోసం రూ.3320 కోట్లని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
ఆంగ్ల సారాంశం
భారతదేశం అంతటా కనెక్టివిటీ మరియు కార్యాచరణ సామర్థ్యాన్ని పెంపొందించడానికి మూడు రైల్వే మల్టీ-ట్రాకింగ్ ప్రాజెక్టులకు ₹18509 కోట్లకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం