తెలంగాణ
ఓయ్-సాయి చైతన్య
<!--
--> <!-- -->తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రైతుల నిరీక్షణ ఫలించింది. ఎట్టకేలకు రైతు భరోసా నిధుల విడుదల ముహూర్తం ప్రకటించారు. ఇదే సమయంలో మరో తాజా నిర్ణయాన్ని అమలు చేయడానికి సిద్దమైంది. రైతు భరోసా అమలులో అర్హులైన విషయం పైన మరోసారి స్పష్టత ఇచ్చింది. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం పథకం అమలు చేయనుంది. ఈ మేరకు కౌలు రైతుల విషయంలోనూ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది.
తెలంగాణ ప్రభుత్వం సుదీర్ఘ విరామం తరువాత యాసంగి రైతు భరోసా నిధుల విడుదలకు నిర్ణయం తీసుకుంది. మార్చి 22వ తేదీ నుంచి సొమ్మును రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు ప్రకటించారు. మూడు విడతలుగా వీటిని అందించాలని నిర్ణయించింది. తొలి విడతలో రూ.3,590 కోట్లు అందించనుంది. 22వ తేదీన సిద్దిపేట జిల్లా నర్మెటలో జరిగే కార్యక్రమంలో వీటిని సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేయనున్నారు. తొలి విడతలో 73 లక్షల మంది రైతులకు అందనుండగా.. మరో 20 రోజుల తర్వాత రెండో విడతగా మరికొంతమంది రైతులకు అందించనున్నారు. ఇక మూడో విడత ఏప్రిల్ నెలాఖరులోగా జమ చేయనున్నారు. మొత్తం రూ.9 వేల కోట్ల నిధులను అందించనున్నారు. కాగా, పథకం అమలు.. అర్హతల విషయంలో ఇప్పటికే పెద్ద ఎత్తున చర్చ జరిగింది. నిజమైన రైతులకే ఈ పథకం అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గత సీజన్‌లో అమలు చేయబడిన వారందరికీ తిరిగి ఈ సారి నిధులు జమ కానున్నాయి.

22వ తేదీ నుంచి రైతుల ఖాతాల్లో నిధుల జమ
అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి చెందని రైతులకు రైతు భరోసా పథకం వర్తించదు. ఇక వ్యవసాయానికి అనుకూలంగా లేని కమర్షియల్ భూములకు వర్తించదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇక ధరణి పోర్టల్‌లో భూమి వివరాలు నమోదు కాకపోతే అనర్హులుగా ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్లు అందుకుంటున్నవారికి ఈ పథకం వర్తించదు. ఇన్‌కమ్ ట్యాక్స్ చెల్లించిన, ప్రజాప్రతినిధులకు కూడా రైతు భరోసా పథకం వర్తించదని అధికారులు. ఇక ఆలయాలు, ట్రస్టులు, ఇతర సంస్థల పేరుపై ఉన్న వ్యవసాయ భూములు ఉన్నవారు కూడా అనర్హులుగా పేర్కొన్నారు. అయితే.. దరఖాస్తుదారుడి పేరు మీద భూమి ధరణి పోర్టల్‌లో నమోదై ఉండాలి -వ్యవసాయం చేయడానికి అనుకూలమైన భూమి అయి ఉండాలని తాజా మార్గదర్శకాలు స్పష్టం చేస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కౌలు రైతులకు కూడా సాయం అందిస్తోంది.
ఆంగ్ల సారాంశం
రైతు భరోసా పథకానికి అర్హతపై తెలంగాణ ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది, మార్గదర్శకాలు జారీ చేయబడ్డాయి