తెలంగాణ
oi-డాక్టర్ వీణా శ్రీనివాస్
తెలంగాణ రాష్ట్రంలో రైతులకు పంట పెట్టుబడికి ఆర్థిక సహాయం అందించే రైతు భరోసా పథకం చెల్లింపులు ఆలస్యం కావడంతో రైతు భరోసా పథకం పైన రైతులలో ఆందోళన వ్యక్తమవుతోంది. యాసంగి సీజన్ ప్రారంభమైన ఇంకా రైతుల ఖాతాలలో పెట్టుబడి సాయం జమ కాలేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రైతుభరోసా రాక రైతుల్లో ఆందోళన
ఫిబ్రవరి చివరివారంలో కానీ, మార్చి మొదటి వారంలో కూడా రైతు భరోసా నిధులు వస్తాయని ఆశించిన రైతు భరోసా ఇస్తున్నారు. రైతులకు ఎకరానికి 6000 చొప్పున అందాల్సిన ఈ నిధులు ఆలస్యం కావడంతో విత్తనాలు, ఎరువులు, ఇతర వ్యవసాయ అవసరాల కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

రైతు భరోసా నిధుల కోసం రైతుల ఎదురుచూపులు
రైతు భరోసా నిధుల కోసం రైతుల బ్యాంకుల చుట్టూ, వ్యవసాయశాఖ అధికారులు తిరుగుతున్నారు. ప్రభుత్వం ఇప్పటివరకు రైతు భరోసాపై ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు లేదా అసలు రైతు భరోసా నిధులు వస్తాయా అన్న అనుమానం కూడా రైతులలో వ్యక్తమవుతోంది. మున్సిపల్ ఎన్నికలు నిర్వహించిన వెంటనే రైతుల బ్యాంకు ఖాతాలలో రైతు భరోసా నిధులు జమ చేసినట్లు ప్రకటించినప్పటికీ, ఇప్పటివరకు అతీగతీ లేకపోవడంతో రైతు భరోసాపై నీలినీడలు కమ్ముకున్నాయి.
ప్రతిపక్షాల ప్రచారంతో రైతుల్లో మరింత ఆందోళన
దీనికి తగ్గట్టు ప్రతిపక్ష పార్టీలు ఇకపై రైతు భరోసా ఇవ్వడం లేదని, రైతు భరోసాను సీఎం ఢిల్లీకి పంపాలని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నందున రైతులలో ఆందోళన మరింత పెరిగింది. ఆరుగాలం శ్రమించి వ్యవసాయం చేస్తున్న అన్నదాతలు, ప్రభుత్వం అందిస్తున్న పెట్టుబడి సాయం ఇప్పటివరకు అందడం లబోదిబోమంటున్నారు.
రైతు భరోసాపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్
సీఎం రేవంత్ రెడ్డి స్పందించి రైతు భరోసా నిధులను త్వరితగతిన తమ ఖాతాలలో జమ చేయాలని రైతులు విజ్ఞప్తి చేశారు. లేదంటే అన్నదాతలు ఆర్థికంగా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కోవలసి వస్తుందని చెబుతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా రైతు భరోసాపై స్పష్టత ఇవ్వాలి. స్పష్టత ఇవ్వకుంటే ఖాతాల్లో డబ్బులు జమయ్యే వరకు రైతుల్లో అనిశ్చితి కొనసాగుతోంది.

