seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 02 March 2026, 2:39 pm Digital Edition : SEEMA KIRANAM

రైతుల ఆస్తి హక్కులకు భద్రత కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

రైతుల ఆస్తి హక్కులకు భద్రత కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

 

కల్లూరు తహసీల్దార్ ఆంజనేయులు

 

రాజముద్రతో పట్టాదారు పాసుపుస్తకాలు

 

ఈనెల 9 వరకు రైతులకు పంపిణీ

 

రాజముద్రతో కూడిన కొత్త పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ ప్రారంభం

 

కల్లూరు, మార్చి 02, (సీమకిరణం న్యూస్) :

రైతుల ఆస్తి హక్కులకు భద్రత కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని కల్లూరు తహసీల్దార్ ఆంజనేయులు పేర్కొన్నారు. సోమవారం కల్లూరు మండలంలోని నాయకల్లు గ్రామంలో కొత్త పట్టదారు పాసు పుస్తకల పంపిణీ కార్యక్రమము నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ ఆంజనేయులు మాట్లాడుతూ రాజముద్రతో పట్టాదారు పాసుపుస్తకాలు ఈనెల 9 వరకు రైతులకు పంపిణీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. కల్లూరు మండలంలోని నాయకల్లు గ్రామములోని రీ-సర్వే కార్యక్రమం తర్వాత పూర్తి విస్తీర్ణం ఎకరముల 3477.794 సెంట్స్ నకు మొత్తం రైతులకు గల ఖాతాలు 1188, గ్రామానికి మొత్తం ఖాతాలు 1188 లోని ప్రస్తుతం 1033 ఖాతాలకు, కర్నూలు జిల్లా కలెక్టర్ కార్యాలయము నుండి పంపిణీ చేయడం జరిగిందన్నారు. నాయకల్లు రెవిన్యూ గ్రామం నందు వ్యవసాయ భూమి కలిగిన రైతులు ప్రక్కన ఉన్న గ్రామాలైన బొల్లవరం, రెమడూరు, పుసులూరు, అనుగొండ, చెట్లమల్లాపురం, కొంగనపాడు, లద్దగిరి మరియు ఉలిందకొండ గ్రామానికి చెందినవారన్నారు. గత రీసర్వే కార్యక్రమంలో నందు సర్వేలో వచ్చిన తప్పులు అయిన ఫోటో/ కులము /మొబైల్ నెంబరు/ ఆధార్ నెంబర్/ 104 ఖాతాలను గుర్తించి వాటిని సరిచేసి మొత్తం 1033 ఖాతాలకు పంపిణీ చేయుటకు పట్టాదారు పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉందన్నారు. నాయకల్లు గ్రామ రైతులతో పాటు సరిహద్దు గ్రామ రైతులు కూడా ఈ పట్టాదారు పసుపుస్తకముల పంపిణీ నందు తమ కొత్త పాస్ పుస్తకములను స్వీకరించవలసిందిగా కోరారు. ప్రస్తుతం ఈ నెల 02 నుండి 09 వరకు వరకు రాజముద్ర కలిగిన పట్టాదారు పాసుపుస్తకములు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో రీ-సర్వే డిప్యూటీ తహసీల్దార్ జయశ్రీ,  వీఆర్వోలు విజయమనోహర్, శ్రీనివాసులు, మద్దిలేటి, రాజు, సురేష్, VS రాజులు పాల్గొన్నారు.