seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 21 March 2026, 1:22 am Digital Edition : SEEMA KIRANAM

రైతులకు శుభవార్త,. వారికి వందశాతం సబ్సిడీతో సోలార్ పంప్ సెట్స్! | గిరిజన రైతులను ఆదుకునేందుకు ఇందిరా సౌర గిరిజన వికాసం పథకాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు.

తెలంగాణ

oi-డాక్టర్ వీణా శ్రీనివాస్

<!--

--> <!--
Google Oneindia TeluguNews
-->

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2026- 27 బడ్జెట్‌లో అనేక విప్లవాత్మక నిర్ణయాలను తీసుకుని ప్రకటన చేశారు. ముఖ్యంగా రైతుల ఆర్థిక స్వావలంబన లక్ష్యంగా కీలక నిర్ణయాలను తీసుకున్నారు. ఈ సంవత్సరం మూడు లక్షల 24 వేల 234 లక్షల కోట్లతో బడ్జెట్ ను శాసనసభలో ప్రవేశపెట్టిన తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గిరిజన రైతులను ఉద్దేశించి శుభవార్త చెప్పారు.

రాష్ట్రవ్యాప్తంగా ఇందిర సౌర గిరిజల వికాసం పథకం

గిరిజన రైతుల సంక్షేమానికి ఉద్దేశించిన ఇందిరా సౌర గిరిజల వికాసం పథకం రాష్ట్రవ్యాప్తంగా అమలులోకి వచ్చింది గిరిజన రైతులకు వంద సబ్సిడీతో సోలార్ పంప్ సెట్లను ప్రభుత్వం అందిస్తోంది.

గిరిజన రైతులను ఆదుకునేందుకు ఇందిరా సౌర గిరిజన వికాసం పథకాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు.

పోడు భూముల్లో ప్రభుత్వ ఉత్పత్తుల తోటలను పెంచాలని నిర్ణయం

ముఖ్యంగా ఆరు లక్షల ఎకరాల పోడు భూముల్లో పంటల ఆదాయాన్ని పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. అచ్చంపేట నియోజకవర్గంలో ఇప్పటికే పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభించిన ఈ పథకం తాలూకు అధ్యయనం చేసి రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.

వ్యవసాయం, సాగునీటి రంగాలకు బడ్జెట్ లో భారీగా నిధులు

రైతు సంక్షేమం పైన ప్రభుత్వం దృష్టి పెట్టిందని, వ్యవసాయం, సాగునీటి రంగాలకు బడ్జెట్‌లో భారీగా నిధులు కేటాయించామని చెప్పారు.సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి 22 వేల 600 కోట్లు, వ్యవసాయ రంగానికి 23 వేల 179 కోట్ల రూపాయలను కేటాయించినట్లు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క తెలిపారు.

సాధారణ రైతులతో పాటు పోడు రైతులకు లబ్ది

రైతు భరోసాకు 18 వేల కోట్ల రూపాయలు, వ్యవసాయ ఉత్పత్తుల బోనస్ కోసం 3500 కోట్ల రూపాయలను కేటాయించి పలు కీలక నిర్ణయాలు తీసుకుని రైతు సంక్షేమానికి పెద్దపీట వేశారు. ఈ కేటాయింపులతో సాధారణ రైతులతో పాటు, గిరిజన పోడు రైతులకు కూడా లబ్ధి జరగనుంది. గిరిజనులకు ఆర్థిక భరోసా కల్పించి వారి జీవన ప్రమాణాల మెరుగుదలకు కృషి చేయండి. తెలంగాణ రాష్ట్రంలోని గిరిజన రైతుల కోసమే 100% సబ్సిడీతో అంటే ఉచితంగా సోలార్ పంప్ సెట్లను ఏర్పాటు చేసి వారి పోడు వ్యవసాయానికి అందించనున్నారు.

ఆంగ్ల సారాంశం

రాష్ట్రవ్యాప్తంగా గిరిజన రైతులను ఆదుకునేందుకు ఇందిరా సౌర గిరిజన వికాసం పథకాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బడ్జెట్‌లో ప్రకటించారు. 100% సబ్సిడీ సోలార్ పంపుసెట్లతో నీటిపారుదల సౌకర్యాన్ని అందించడం ఈ పథకం లక్ష్యం, సుమారు 2.10 లక్షల మంది గిరిజన రైతులకు ప్రయోజనం చేకూరుతుంది.

Source link