seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 05 July 2026, 4:21 pm Digital Edition : SEEMA KIRANAM

రైతులకు ఉచితంగా హైబ్రిడ్ బీజీ-2 పత్తి విత్తనాల పంపిణీ

వెల్దుర్తి రైతు సేవా కేంద్రంలో ఐదు గ్రామాల రైతులకు విత్తనాల పంపిణీ

వెల్దుర్తి, జూలై 05, (సీమకిరణం న్యూస్):

 

వెల్దుర్తి మండలంలోని రైతు సేవా కేంద్రంలో మల్లెపల్లి, బొమ్మిరెడ్డిపల్లి, చెరుకులపాడు, వెల్దుర్తి, అల్లుగుండు గ్రామాలకు చెందిన రైతులకు పత్తి ఉత్పాదకత అభివృద్ధి పథకం “కాపాస్ కాంతి” కింద హైబ్రిడ్ బీజీ-2 పత్తి విత్తనాలను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పత్తికొండ వ్యవసాయ సహాయ సంచాలకులు (ADA) మోహన్ విజయ్ కుమార్ మాట్లాడుతూ, అధిక సాంద్రతతో పత్తి సాగు చేపట్టడం ద్వారా రైతులు అధిక దిగుబడులు సాధించవచ్చని తెలిపారు. అలాగే పత్తి పంటలో కంది, మినుము, పెసర వంటి పప్పుధాన్యాలను అంతర పంటలుగా సాగు చేయడం వల్ల అదనపు ఆదాయం లభించడంతో పాటు భూసారం కూడా మెరుగుపడుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి అక్బర్ బాషా, వ్యవసాయ విస్తరణ అధికారి (AEO) అజయ్ భార్గవ్, రైతు సేవా కేంద్రం సిబ్బంది ఆనందలక్ష్మి, ప్రమీల, శ్రీకాంత్‌తో పాటు మండలంలోని రైతులు పాల్గొన్నారు.