seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 08 March 2026, 5:45 am Digital Edition : SEEMA KIRANAM

రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్, కీలక మార్పులు..!! | తాజా ప్రతిపాదనలుగా అర్హులైన లబ్ధిదారులకు రేషన్ సేవలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది

ఆంధ్ర ప్రదేశ్

ఓయ్-సాయి చైతన్య

<!--

--> <!--
Google Oneindia TeluguNews
-->

ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం ఏర్పడిన తరువాత రేషన్ వ్యవస్థలో కొత్త మార్పులు చేసింది. కొత్త కార్డులతో పాటుగా స్మార్ట్ కార్డులను పంపిణీ చేసింది. గతం లో ఉన్న రేషన్ వాహనాలను తప్పించి.. రేషన్ వాహనాలు వద్దే సరఫరా చేస్తోంది. ఇక త్వరలో రేషన్ షాపుల్లోనే మాల్స్ ఏర్పాటు దిశగా కసరత్తు జరుగుతోంది. ఇక, తాజాగా రేషన్ కార్డులకు సంబంధించిన సేవల్లో కీలక మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

రేషన్ కార్డుల్లో మార్పులు, చేర్పుల కోసం ప్రభుత్వం లబ్దిదారులకు అవకాశం కల్పించింది. కాగా, వీరికి సంబంధించి రైస్ కార్డ్ దరఖాస్తు సేవ రుసుం (సర్వీస్ ఛార్జ్)లను పెంచింది. కొత్త కార్డ్, డూప్లికెట్ రైస్ కార్డ్, రైస్ కార్డులో సభ్యుల చేర్పు, తొలగింపు, వివరాల సవరణ, చిరునామా మార్పుతో పాటు రైస్ కార్డ్ విభజన వంటి అన్ని సేవా దరఖాస్తు ఛార్జీలను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో రూ. 24 సేవా రుసుం కలిగిన సేవలు రూ.100కు పెంచారు. అదే విధంగా రూ 48గా ఉన్న రైస్ కార్డ్ విభజన సేవ రూ.200కు పెరిగింది. ఇక.. మీసేవ, స్వర్ణ గ్రామ వార్డు కార్యాలయం, సిటిజన్ పోర్టల్, వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా వివిధ రకాల రైస్ కార్డ్ సేవలు అందుబాటులో ఉన్నాయి. రేషన్ కార్డు పోగొట్టుకున్న వారికి డూప్లికెట్ కార్డు పొందాలన్నా.. వివరాలు తప్పుగా ఉంటే సరి చేసుకునేందుకు.. అదే విధంగా ఉన్న సభ్యులను తొలిగించడం.. చిరునామా మార్పు… కార్డు స్ప్లిట్ వంటి వాటి కోసం ఈ ఛార్జీల్లో మార్పులు జరిగాయి.

అర్హులైన లబ్ధిదారులకు రేషన్ సేవలపై తాజా ప్రతిపాదనల మేరకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది.

ప్రభుత్వం తాజా నిర్ణయాలతో

ఇప్పటికే రేషన్ వ్యవస్థలో సంస్కరణల్లో భాగంగా క్యూఆర్ కోడ్‌తో కూడిన కొత్త స్మార్ట్ కార్డులు రాష్ట్రంలోని లబ్దిదారులందరికీ పంపిణీ చేయబడుతున్నాయి. వృద్దులకు రేషన్ డీలర్లు ఇంటికి వెళ్లి సరుకు పంపిణీ చేస్తున్నారు. మిగిలినవారు వద్దకు వెళ్లి తీసుకోవాల్సి ఉంటుంది. ఇక ముందు షాపుల ద్వారా బియ్యం, పంచదార మాత్రమే పౌరసరఫరాల శాఖ పంపిణీ చేస్తుంది. కానీ ఇప్పుడు రాగులు, జొన్నలు, గోధుమ పిండి కూడా లబ్దిదారులకు పంపిణీ చేస్తున్నారు. గోధుమ పిండిని కిలో రూ.20కే అందించారు. ప్రస్తుతం రూ.70గా ఉండగా.. కేవలం రూ.20కే ప్రభుత్వం అందిస్తోంది. త్వరలోనే విలేజ్ మాల్స్ ఏర్పాటు దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అన్ని రకాల సరుకులు ఒకే చోట అందే విధంగా ప్రణాళికలు రూప కల్పన చేస్తున్నారు. ముందుగా పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసిన వాటిని అమలు చేసి… దశల వారీగా విస్తరించాలని నిర్ణయించారు.

ఆంగ్ల సారాంశం

రేషన్ కార్డ్ హోల్డర్ల పేర్లు మరియు సేవలను మార్చడానికి సేవలపై AP ప్రభుత్వం తాజా నిర్ణయం

Source link