తెలంగాణ
ఓయ్-సాయి చైతన్య
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్దమైంది. ఈ ఎన్నికలు మూడు ప్రధాన పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా మారాయి. సీఎం రేవంత్ సమర్థతకు అసలైన పరీక్షగా నిలుస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత పార్టీ గుర్తుల మీద జరుగుతున్న ఎన్నిక కావటంతో ఈ ఫలితాలు రేవంత్ తో సహా మంత్రుల రాజకీయ భవిష్యత్ కు కీలకంగా మారుతున్నాయి. కాంగ్రెస్ హైకమాండ్ ఈ ఎన్నికలను నిశితంగా గమనిస్తోంది. ఇదే సమయంలో బీఆర్ఎస్.. బీజేపీ సైతం వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సమయం అయ్యేందుకు ఈ ఎన్నికలే నాందిగా భావిస్తున్నాయి. అయితే.. క్షేత్ర స్థాయిలో మారుతున్న లెక్కలు ఆసక్తిని పెంచుతున్నాయి.
రేపు (బుధవారం) మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌కు తుది ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రధాన పార్టీల అభ్యర్ధులు ఓటర్లు చివరి నిమిషం వరకు తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలను ముమ్మరం చేసారు. కొద్ది రోజుల క్రితం ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ నే ఎక్కువ సీట్లు దక్కించుకున్నా కూడా ఇవి పార్టీ సింబల్ పై జరిగినవి కాకపోవటంతో ఎవరి క్లెయిమ్స్ వాళ్ళు చేసుకుంటున్నారు. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బిఆర్ఎస్ కూడా ఎన్నికల్లో తామే మెజారిటీ స్థానాలు గెలిచామని ప్రచారం చేసుకుంది. కాగా, మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ సింబల్స్ తో జరుగుతాయి. బీజేపీ మున్సిపల్ ఎన్నికల విషయంలో మాత్రం గట్టిగానే ప్రయత్నం చేసింది. దీంతో ఈ కీలక ఎన్నికల్లో త్రిముఖ పోటీ. రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఎన్నిక జరగనుంది. ఈ ఎన్నికలు బ్యాలట్ విధానంలో జరుగుతున్నాయి. ఫలితాలు ఫిబ్రవరి 13న వెల్లడికానున్నాయి. ఈ ఎన్నికల్లో మొత్తం 12930 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఏవి అయినా కూడా సహజంగా అధికార పార్టీ కి కొంత సానుకూలత ఉంటుంది. అయితే, క్షేత్ర స్థాయిలో మాత్రం పబ్లిక్ మూడ్ ఏంటనేది రేపు తేలిపోనుంది.

రేవంత్ తో సహా మంత్రుల సమర్ధతకు పరీక్షగా
బీఆర్ఎస్ ఈ ఎన్నికల పైన భారీ ఆశలతో ఉంది. రేవంత్ హీమీల అమలులో విఫలం అయ్యారని.. కాంగ్రెస్ ను ఓడిస్తేనే పథకాలు అమలవుతున్నాయని ప్రచారం చేశారు. అదే సమయంలో సీఎం రేవంత్ పలు జిల్లాల్లో సుడిగాలి పర్యటన చేసారు. తన రెండేళ్ల పాలన చూసి ఓట్లు వేయాలని అభ్యర్ధించారు. బీజేపీ స్థానిక అంశాలను ప్రస్తావిస్తూ… బీఎస్, కాంగ్రెస్ వైఫల్యాలను ప్రచారం చేస్తూ తమకు మద్దతు ఇవ్వాలని కోరుతోంది. అయితే.. ఈ మున్సిపల్ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు అధికార కాంగ్రెస్ పార్టీ దక్కించుకోకపోతే మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాజకీయంగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఫలితాల్లో ఏ మాత్రం తేడా వచ్చినా కూడా రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించటానికి సొంత పార్టీ నాయకులే సిద్ధం అవ్వడం ఖాయం. ఇప్పటికే జిల్లాల వారిగా మంత్రులకు సీఎం రేవంత్ బాధ్యతలు అప్పగించారు. దీంతో.. ఇప్పుడు ఈ పోలింగ్ సరళి నుంచే జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తుది ఫలితాల పైన ఉత్కంఠ నిర్ణయం.
-

రాసి పెట్టుకోండి.. అసెంబ్లీ ఎన్నికలు అప్పుడే, 2028లో కాదు- తేల్చేసిన రేవంత్..!!
-

కేసీఆర్ కు కానుకగా ఇస్తాను, హరీష్ కీలక వ్యాఖ్యలు…!!
-

నెక్స్ట్ జరిగేది ఇదే, కేటీఆర్ సంచలనం..!!
-

మేం ఆ పని చేస్తున్నాం.. మున్సిపల్ ఎన్నికలలో హీటెక్కిస్తున్న ప్రతిజ్ఞలు!
-

మందు బాబులకు బ్యాడ్ న్యూస్- వైన్స్, బార్లు బంద్, ఎప్పటి వరకు..!!
-

అక్కడ మద్యం షాపులు బంద్.. బల్క్ మెసేజ్ లు, గుంపులుగా ఉండటం నిషేధం!
-

వారిని ఎక్కడ దాచుకున్నా వదిలిపెట్టం – కేటీఆర్ హెచ్చరిక..!!
-

స్కూళ్లకు ఈ వారంలో వరుసగా నాలుగు రోజులు సెలవులు, తాజా ఉత్తర్వులు..!!
-

అక్కడ ఫ్రిజ్ లు, కొత్త టీవీలు, వాషింగ్ మెషీన్లు.. నక్కతోక తొక్కిన ఓటర్లు!
-

రేపే రైతు భరోసా, పోలింగ్ కు ముందే నిధుల జమ – ఒక్కొక్కరి ఖాతాలో రూ 6 వేలు..!?
-

కేసీఆర్ కు బీపీ, షుగర్ వచ్చింది అందుకే!
-

హైదరాబాద్ నుంచి విశాఖ వైపు వెళ్లే ప్రయాణికులకు గుడ్ న్యూస్..ఇక నుంచి..!!
-

T20 World Cup: అభిషేక్‌కు అనారోగ్యం.. ఆ స్టార్ ఆల్‌రౌండర్‌కు పిలుపు..!!
-

ఎట్టకేలకు రైతు భరోసా నిధులకు లైన్ క్లియర్, ఆ రోజునే జమ..!!
-

ఎన్టీఆర్, సుకుమార్ కాంబోలో భారీ సినిమా..! రాండ్ రాక్ స్టోరీతో..
















