Wednesday, April 8, 2026
ads
📄 ePaper
Homeతెలంగాణరియల్ ఎస్టేట్: కుప్పకూలిన మార్కెట్. రియల్ ఎస్టేట్ పై AI పంజా! | రియల్ ఎస్టేట్...

రియల్ ఎస్టేట్: కుప్పకూలిన మార్కెట్. రియల్ ఎస్టేట్ పై AI పంజా! | రియల్ ఎస్టేట్ మార్కెట్ హెచ్చరిక: ఉత్పాదక AI జాబ్ రిస్క్‌ల కారణంగా DLF, శోభా మరియు ప్రెస్టీజ్ స్టాక్‌లు ఎందుకు పడిపోతున్నాయి

📰 Generate e-Paper Clip


వ్యాపారం

-లింగారెడ్డి గజ్జల

దేశీయ ఐటీ రంగంలోకి కృత్రిమ మేధస్సు (AI) సునామీలా దూసుకుపోతోంది. అయితే, ఈ సాంకేతిక విప్లవం కేవలం సాఫ్ట్‌వేర్ కోడింగ్‌కే పరిమితం కాకుండా, రియల్ ఎస్టేట్ మార్కెట్‌ను సైతం కుదిపేస్తోంది. ఐటీఐ వల్ల భారీగా ఉద్యోగాల కోత తప్పదన్న ఆందోళనల నడుమ, రియల్ ఎస్టేట్ షేర్లు సోమవారం దారుణంగా పతనమయ్యాయి.

ఫిబ్రవరి 12న ఒక్కరోజే నిఫ్టీ రియల్టీ సూచీ 1.45 శాతం క్షీణించి 842.35 పాయింట్లకు పడిపోయింది. డీఎల్‌ఎఫ్, శోభ, ప్రెస్టీజ్ ఎస్టేట్స్ వంటి దిగ్గజ కంపెనీల షేర్లు 3 శాతం వరకు నష్టపోవడం ఇన్వెస్టర్లలో నెలకొన్న భయాందోళనలకు అద్దం పడుతోంది.

రియల్ ఎస్టేట్ మార్కెట్ హెచ్చరిక ఉత్పాదక AI జాబ్ రిస్క్‌ల కారణంగా DLF శోభా మరియు ప్రెస్టీజ్ స్టాక్‌లు ఎందుకు పడిపోతున్నాయి

సాధారణంగా హైదరాబాద్, బెంగళూరు, పుణే వంటి నగరాల్లో లగ్జరీ గృహాల విక్రయాలకు ఐటీ ఉద్యోగుల ప్రధాన ఆధారం. ఇప్పుడు ఆంథ్రోపిక్ వంటి సంస్థలు ప్రవేశపెట్టిన ‘క్లాడ్’ (క్లాడ్) అత్యాధునిక ఏఐ టూల్స్ వల్ల సంప్రదాయ సాఫ్ట్‌వేర్ సేవల్లో మానవ ఇంజనీర్ల అవసరం తగ్గుతుందన్న అంచనాలు వెలువడుతున్నాయి.

జనరేటివ్ ఏఐ వల్ల కోడింగ్ ఉద్యోగాల్లో 20 నుంచి 25 శాతం వరకు కోత పడే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇదే జరిగితే, గృహ రుణాల్లో 35 శాతం వాటా కలిగి ఉన్న ఐటీ నిపుణుల కొనుగోలు శక్తి కోరబడుతుంది. తత్ఫలితంగా, టైర్-1 నగరాల్లో లగ్జరీ గృహాలకు డిమాండ్ 12 శాతం మేర తగ్గే ప్రమాదం ఉందని ఫోర్టేషియా రియల్టీ వంటి సంస్థలు విశ్లేషిస్తున్నాయి.

మరోవైపు, ఐటీ దిగ్గజ సంస్థలైన టీసీఎస్, ఇన్ఫోసిస్ వంటి కంపెనీలు ఇప్పటికే ఆటోమేషన్ వైపు అడుగులు వేస్తూ మధ్యస్థ స్థాయి ఉద్యోగుల తొలగింపునకు శ్రీకారం చుట్టింది. 2027 ఆర్థిక సంవత్సరం నాటికి దాదాపు 2 లక్షల ఐటీ ఉద్యోగాలు కనుమరుగయ్యే అవకాశం ఉందన్న అంచనాలు రియల్ ఎస్టేట్ డెవలపర్ల నిద్ర చెడగొడుతున్నాయి.

ముఖ్యంగా రూ. 10 లక్షల నుంచి రూ. 30 లక్షల మధ్య ఉండే మధ్యతరగతి ఫ్లాట్లతో పాటు, కోట్లు వెచ్చించే విల్లాల మార్కెట్ కూడా స్తబ్దతకు లోనయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అన్ రోక్ (ANAROCK) ప్రకారం, ఇప్పటికే ప్రీమియం గృహ విక్రయాలు ఏడాదికి 15 శాతం క్షీణించాయి.

మార్కెట్‌లో కనిపిస్తున్న రియల్ ఎస్టేట్ పతనం..

అయితే, ఈ గందరగోళం మధ్య కొంతమంది నిపుణులు ఆశాజనక దృక్పథాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో కనిపిస్తున్న ఈ పతనం కేవలం భావోద్వేగపూరితమైన స్పందన మాత్రమేనని, ప్రాథమికంగా రియల్ ఎస్టేట్ రంగానికి వచ్చిన ముప్పేమీ లేదని కొందరు విశ్లేషిస్తున్నారు.

ఏఐఐ అనేది ఉత్పాదకతను పెంచుతుందే తప్ప మానవ మేధస్సును పూర్తిగా భర్తీ చేయదని, కార్యాలయాల అవసరం ఎప్పటికీ వారు వాదిస్తున్నారు. ధర, టెక్నాలజీ మారుతున్న వేగానికి అనుగుణంగా రియల్ ఎస్టేట్ తన వ్యూహాలను మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రస్తుత పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి.



Source link

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular