తెలంగాణ
oi-డాక్టర్ వీణా శ్రీనివాస్
<!--
--> <!-- -->తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఎలాంటి అంతరాయాలు లేకుండా అత్యధిక డిమాండ్ విద్యుత్ సరఫరా చేసిన ఘనత పీడీసీఎల్ నమోదు చేసింది. ఈరోజు ఇప్పటివరకు ఎన్నడూ లేనంత అత్యధిక విద్యుత్ డిమాండ్ నమోదైంది. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 18,139 మెగావాట్ల విద్యుత్ అవసరం ఏర్పడగా, విద్యుత్ శాఖ అధికారులు విజయవంతంగా అందించారు.
అత్యధిక విద్యుత్ డిమాండ్ పై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
పెరుగుతున్న పరిశ్రమలు, సాగు అవసరాలు, గృహోపకరణాల వినియోగం పెరగడం వంటి వాటితో విద్యుత్ వినియోగం పెరిగిందని అధికారులు తెలిపారు. భవిష్యత్తులో మరింత పెరగనున్న విద్యుత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని అవసరమైన ఏర్పాట్లు చేసుకున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.

రికార్డ్ డిమాండ్ ఉన్నా ఇబ్బంది లేకుండా సరఫరా
రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి డిమాండ్‌తో పాటు, ట్రాన్స్‌మిషన్ మరియు డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్‌లను పునరుద్ధరింపజేసిన ఫలితంగా ఈ రికార్డును సమర్థవంతంగా ఎదుర్కొంటుంది. భవిష్యత్తులో వ్యవసాయం, పరిశ్రమలు, గృహ అవసరాలకు అంతరాయం లేకుండా విద్యుత్తు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు.
ఎన్పీసీఎల్ చరిత్రలోనే విద్యుత్ వినియోగం స్థాయికి :సీఎండీ
ఈ పరిణామం తెలంగాణ విద్యుత్ రంగ సామర్థ్యానికి నిదర్శనమని అధికార వర్గాలు అభిప్రాయపడ్డాయి. కాగా ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి ఎన్పీడీసీఎల్ చరిత్రలోనే విద్యుత్ వినియోగం సరికొత్త స్థాయిని చేరిందని పేర్కొన్నారు. నేడు సంస్థ పరిధిలో 6,441 మెగావాట్ల అత్యధిక విద్యుత్ డిమాండ్ నమోదయిందని, రికార్డు స్థాయి డిమాండ్ విద్యుత్ సరఫరా చేయడంలో ఎక్కడ ఇబ్బంది లేకుండా చేయగలిగామని ఆయన పేర్కొన్నారు.
సంస్థ చరిత్రలోనే లిఖించదగిన రోజు
నేడు చరిత్రలోనే లిఖించదగిన రోజు సంస్థ అని. నిన్న కూడా 6,273 మెగావాట్ల రికార్డును ఎన్పీడీసీఎల్ నమోదు చేసింది. పెరుగుతున్న నీటి దృష్ట్యా విద్యుత్ వినియోగం భారీగా పెరుగుతుందని, ముందు ముందు మరింత విద్యుత్ డిమాండ్ చోటు చేసుకునే పరిస్థితి లేకపోలేదని వరుణ్ రెడ్డి స్పష్టం చేశారు.
డిమాండ్ ఎంత ఉన్నా అవాంతరాలు లేని విద్యుత్ సరఫరా
డిమాండ్ ఎంత విద్యుత్ సరఫరాకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా నిరంతరం సరఫరా చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. వేసవి కాలంలో ఎదురయ్యే విద్యుత్ డిమాండ్ ను ఎదుర్కోవడానికి తాము పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ముందస్తు ప్రణాళికలతో, సాంకేతిక సమస్యలు తలెత్తకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు.
ఆంగ్ల సారాంశం
తెలంగాణ ఆల్ టైమ్ హై 18,139 మెగావాట్ల విద్యుత్ డిమాండ్‌ను నమోదు చేసింది. రాష్ట్రంలో రికార్డు డిమాండ్‌ను విజయవంతంగా పూర్తి చేశామని, భవిష్యత్‌లో విద్యుత్ అవసరాలకు సిద్ధంగా ఉన్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు.