seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 08 March 2026, 7:13 pm Digital Edition : SEEMA KIRANAM

రాష్ట్రంలో ‘బీచ్ వెడ్డింగ్’ జోరు.. తక్కువ ధరకే సముద్ర తీరాన వివాహం.. | తమిళనాడులో బీచ్ వెడ్డింగ్ ఊపందుకుంది: ప్రభుత్వ వినూత్నమైన తక్కువ-ధర కార్యక్రమం భారీ జంటలను ఆకర్షించింది

భారతదేశం

ఓయ్-బొమ్మ శివకుమార్

<!--

--> <!--
Google Oneindia TeluguNews
-->

పెళ్లంటే నూరేళ్ల పంట.. జీవితంలో ఒకేసారి జరుపుకునే కార్యక్రమం. అందుకే యువతీయువకులు ఈ మూడు ముళ్ల బంధాన్ని స్పెషల్ గా సెలబ్రేట్ చేసుకోవాలని అనుకుంటారు. అందుకోసం ఎంతైనా ఖర్చు పెట్టేందుకు రెడీ అవుతున్నారు. పెళ్లి అనేది తమ లైఫ్ లో మెమొరబుల్ గా మిగిలిపోవాలని అనుకుంటున్నారు. ప్రస్తుతం ఈ విధానం యువతలో వేగంగా పెరిగిపోతుంది.

ఇటీవలి కాలంలో డెస్టినేషన్ వెడ్డింగ్ లు కూడా అధికం అవుతున్నాయి. ఇంటి దగ్గర లేదా కళ్యాణ మండపాల్లో పెళ్లిళ్లు పాతకాలం పద్ధతులుగా మారాయి. ఇప్పుడు సెలబ్రిటీల నుంచి మామూలు యువత దాకా అంతా డెస్టినేషన్ వెడ్డింగ్ వైపే మొగ్గు చూపుతున్నారు. ఇది గమనించిన తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బీచ్ వెడ్డింగ్ అనే కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. యువతీయువకులకు తక్కువ ధరకే అందించడమే కాకుండా రాష్ట్రంలో టూరిజాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో తమిళనాడు ప్రభుత్వం ఈ అడుగులు వేసింది.

తమిళనాడులోని సముద్రం ఒడ్డున ఈ బీచ్ వెడ్డింగ్ తక్కువ ధరకే అందిస్తోంది. తమిళనాడు ప్రభుత్వం, తమిళనాడు టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్ సంయుక్తంగా ఈ బీచ్ వెడ్డింగ్‌ను అమలు చేస్తోంది. సెలబ్రిటీస్ మాత్రమే కాకుండా ఈ బీచ్ వెడ్డింగ్ ను సామాన్య ప్రజలకు సైతం అందుబాటులోకి తీసుకురావాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది.

బీచ్ వెడ్డింగ్ పథకంలో భాగంగా ప్రైవేట్ రిసార్టులతో పోల్చితే తక్కువ ధరకే ఈ బీచ్ వాతావరణంలో బీచ్ వెడ్డింగ్ సౌకర్యాలను యువతీయువకులకు అందించడం.. ఈ పథకం ప్రారంభంలో మామల్లాపురంలోని తమిళనాడు బీచ్ రిసార్ట్ హోటల్‌లో ప్రారంభం. ఇక వెన్యూ అండ్ బుకింగ్ ఫీజు విషయానికి వస్తే రూ. 10,000 ఉంది. అలాగే వెజిటేరియన్ మీల్స్ ఒక్కో వ్యక్తికి రూ. 1,100 స్టార్టింగ్ ఉంది. అలాగే రూమ్స్ కూడా అందుబాటులో ఉంచుతోంది. 22 గంటలపాటు స్టే కోసం రూ. 5వేలు చెల్లిస్తే సరి.

తమిళనాడు ప్రభుత్వం యొక్క వినూత్నమైన తక్కువ-ధర కార్యక్రమం భారీ జంటలను ఆకర్షించడంలో బీచ్ వెడ్డింగ్ ఊపందుకుంది

ఈ పథకంలో భాగంగా ప్రభుత్వం బీచ్ ప్రాంతాన్ని, కేటరింగ్ ను ఏర్పాటు చేస్తుంది. అయితే కుటుంబ సభ్యుల స్టేజీ సెటప్, డెకరేషన్స్, లైటింగ్ బాధ్యతలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ పథకంలో భాగంగా రాష్ట్రంలోని బీచ్ లను బ్లూ ఫ్లాగ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కు అనుగుణంగా అనేక మార్పులు చేస్తోంది. ఈ మేరకు రాష్ట్రంలోని కోవలం, మరీనా, అలాగే నాగపట్టినం, రామనాథపురం బీచ్ లను అభివృద్ధి చేస్తోంది.

ఇక ఇప్పటికే రాష్ట్రంలో అర్హులైన నవ వధూవరులకు తమిళనాడు ప్రభుత్వం ఆర్థికంగా చేయూతను అందిస్తోంది. ఈ మేరకు మూవలూర్ రామమిర్తమ్ అమ్మాయిర్ మ్యారేజ్ అసిస్టెంట్స్ స్కీమ్ లో భాగంగా రూ. 50 వేలు అందిస్తోంది. అలాగే మంగళసూత్రం కోసం 8 గ్రాముల బంగారం కూడా అందిస్తోంది.

Source link