Friday, March 6, 2026
ads
📄 ePaper
Homeతెలంగాణరాజమండ్రిలో కిడ్నీలు పాడై నలుగురు మృతి..నలుగురి పరిస్థితి విషమం.. కల్తీ పాలే కారణమా? | రాజమండ్రి...

రాజమండ్రిలో కిడ్నీలు పాడై నలుగురు మృతి..నలుగురి పరిస్థితి విషమం.. కల్తీ పాలే కారణమా? | రాజమండ్రి పాల దుర్ఘటనలో మృతుల సంఖ్య నాలుగుకు చేరింది. నలుగురి పరిస్థితి విషమంగా ఉంది, కేసు దర్యాప్తులో ఉంది

📰 Generate e-Paper Clip


ఆంధ్ర ప్రదేశ్

oi-డాక్టర్ వీణా శ్రీనివాస్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజమహేంద్రవరంలో కిడ్నీ సమస్యలతో ఆసుపత్రుల్లో చేరిన వారిలో మరో ఇద్దరు మృతి చెందారు. దీంతో మృతి చెందిన వారి సంఖ్య నాలుగుకు చేరింది ఈరోజు తెల్లవారుజామున లాల చెరువు చౌడేశ్వరి నగర్ కు చెందిన ఎన్ శేషగిరిరావు, రాధాకృష్ణమూర్తి మృత్యువాత పడ్డారు. ఇంకా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మరో నలుగురి పరిస్థితి చాలా విషమంగా ఉంది.

వంతులు, మూత్ర విసర్జన కాక ఆసుపత్రిలో 14 మంది

రాజమహేంద్రవరంలో ఒకే సమయంలో చేరిన ఏకకాలంలో కిడ్నీ వ్యాధి బారినపడి ఆసుపత్రుల్లో చేరిన విషయం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. లాలా చెరువు సమీపంలోని చౌడీశ్వరి నగర్ ప్రాంతంలో దాదాపు 15వ తేదీ తర్వాత నుంచి వాంతులతో, మూత్ర విసర్జన కా ప్రదర్శన, పొట్ట ఉబ్బడం తదితర సమస్యలతో దాదాపు 14 మంది ఆసుపత్రుల్లో చేరారు. ఇది స్థానికంగా తీవ్ర కల్లోలం రేపింది.

రాజమండ్రి పాల దుర్ఘటనలో మృతుల సంఖ్య నాలుగుకు చేరుకుంది. నలుగురి పరిస్థితి విషమంగా ఉంది కేసు దర్యాప్తులో ఉంది

అందరికీ పాలు పోసింది ఒకే వ్యక్తి.. పాల కల్తీ కారణమా

ఆసుపత్రి పాల ప్రతి ఒక్కరికి ఒకే వ్యక్తి పాలు సరఫరా చేయడం, పాలలో కల్తీ జరిగి ఉండొచ్చు అన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది. కల్తీ పర కారణంగానే ఈ విధంగా జరిగి ఉండొచ్చని వారు వైద్యాధికారులు, పోలీసులకు బాధితులు చెప్పారు. శివరాత్రి రోజు పాలు, పెరుగు చేదుగా ఉన్నారని కొందరు బాధితులు పోలీసులకు ఉన్నారు.

ఇప్పటికి నలుగురు మృతి, నలుగురి పరిస్థితి విషమం

ఇప్పటికే ఈ ఘటనలో 76సంవత్సరాల భాగిశెట్టి కనక రత్నం, 75సంవత్సరాల తాడి కృష్ణవేణి నవలగా, తాజాగా 72 ఏళ్ల శేషగిరిరావు 74 ఏళ్ల రాధాకృష్ణమూర్తి మృతి చెందారు. బాధితుల్లో ఎక్కువమంది 60 సంవత్సరాలకు పైబడిన వారే కాగా, ఒక ఐదు నెలల శిశువు మూడేళ్ల బాలుడు కూడా ఉన్నారు. ఒకే కుటుంబం నుంచి నలుగురు ఒకేసారి అశ్వస్థతకు గురికావడంతో ఆదివారం నాడు ఈ విషయం అధికారుల దృష్టికి వచ్చింది.

పాల వ్యాపారిని విచారిస్తున్న పోలీసులు

కోరుకొండ మండలానికి చెందిన గణేష్ అనే వ్యాపారి వీరికి ఈ పాలను అందించినట్లు గుర్తించిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. ఇప్పటికే అతను విక్రయించే పాలను లియాబ్ కు పంపించడంతో పాటు బాధితుల రక్త మూత్ర నమూనాలను టాక్సికాలజీ పరీక్షలకు పంపించారు.

కల్తీ పాల వ్యవహారంతో ఆందోళన

ఇంకా ఈ నివేదికలు రావలసింది. ఏది ఏమైనా ఏపీలోని రాజమహేంద్రవరంలో ఇప్పుడు కల్తీ పాల వ్యవహారం కలకలం రేపుతోంది. ప్రతి ఒక్కరికి ఆందోళన కలిగిస్తుంది. అసలు ఏం జరిగింది ఇంత మంది అస్వస్థతకు వచ్చారు అన్నది తెలియాల్సి ఉంది.



Source link

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular