seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 23 March 2026, 9:39 pm Digital Edition : SEEMA KIRANAM

రాజకీయ దురంధరుడు చంద్రబాబు: స్టీల్ ప్లాంట్ భూమిపూజలో పవన్ కళ్యాణ్ కితాబు! | స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన కార్యక్రమంలో చంద్రబాబును పొలిటికల్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రశంసించారు.

ఆంధ్ర ప్రదేశ్

oi-డాక్టర్ వీణా శ్రీనివాస్

<!--

--> <!--
Google Oneindia TeluguNews
-->

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ భూమి పూజ కార్యక్రమం అత్యంత ఘనంగా జరిగింది. ఏపీ సీఎం చంద్రబాబు ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ లక్ష్మీ నివాస్ మిట్టల్, ఆ ఇండియా హెడ్ ఆదిత్య మిట్టల్, కేంద్రమంత్రి వర్మ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ ఇతరులతో ఈ స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపన చేశారు.

స్టీల్ ప్లాంట్ భూమిపూజలో పాల్గొనడం సంతోషం: పవన్ కళ్యాణ్

ఈ సందర్భంగా స్టీల్ ప్లాంట్ భూమి పూజలో పాల్గొనడం సంతోషంగా ఉందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్న స్టీల్ ప్లాంట్ ప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు. స్టీల్ ప్లాంట్ ద్వారా లక్ష మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని, ఉత్తరాంధ్ర ప్రజలకు ముఖ్యంగా ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి.

స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన కార్యక్రమంలో చంద్రబాబును పొలిటికల్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రశంసించారు.

లక్ష్మీ మిట్టల్ ను ఒప్పించి పెట్టుబడులు తెచ్చిన ఘనత చంద్రబాబుది

ఆర్సెల్లార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ పెట్టుబడులు తమల విశ్వాసాన్ని పెంచాయని, పెట్టుబడులు రావాలంటే దర్శనికత ఉన్న నేత ఎన్నికలలో తాను చెప్పానని, అటువంటి నేత చంద్రబాబు అన్నారు. లక్ష్మీ మిట్టల్ ను ఒప్పించి పెట్టుబడులు తీసుకురావాలంటే అది చంద్రబాబు వల్లే సాధ్యమైందని తెలియజేసారు. చంద్రబాబు రాజకీయ దురంధరుడు అంటూ పవన్ కళ్యాణ్ కొనియాడారు.

అనంతపురం కియాతో ఆ ప్రాంతం మారినట్టే ఇక్కడ కూడా

ఏపీకి పెట్టుబడులు వస్తున్నాయంటే చంద్రబాబు కారణమని అమిత్ షా చెప్పారు. దేశంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ గ్రీన్ ఫీల్డ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు జరగబోతుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో గ్రీన్ఫీల్డ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు జరుగుతాయి. అనంతపురంలో కియా పరిశ్రమతో ఆ ప్రాంత రూపురేఖలు మారినట్టు ఆర్సెల్లార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ తో ఈ ప్రాంత రూపురేఖలు మారిపోతున్నాయి.

పెట్టుబడులు సాధిస్తున్నాం

1.30 లక్షల కోట్ల రూపాయల పరిశ్రమకు భూమి పూజ చేయడం సంతోషంగా ఉంది. అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్టుబడులకు సానుకూలత కల్పించామని, రాష్ట్ర ప్రయోజనాలు, పెట్టుబడులు సాధిస్తున్నాం అన్నారు. ఇప్పటికే విశాఖలో గూగుల్ సెంటర్ కు కూడా పెట్టుబడులు వచ్చాయి.

మోడీ ప్రయాణ ప్రేరణాత్మకం అన్న పవన్ కళ్యాణ్

అంతేకాదు అంతకుముందు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భారత ప్రధాని నరేంద్ర మోడీకి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ప్రభుత్వ అధిపతిగా నిరవధికంగా 8931 రోజుల సేవ పూర్తి చేసిన సందర్భంగా పవన్ కళ్యాణ్ ఆయనను ప్రత్యేకంగా ప్రశంసించారు. గుజరాత్ ప్రధానిగా ప్రారంభమైన నరేంద్ర మోడీ రాజకీయ ప్రయాణం భారత దేశానికి విశేష సేవలు అందించారు అన్నారు పవన్ కళ్యాణ్.

ఆంగ్ల సారాంశం

ఆంధ్రప్రదేశ్‌లోని ఆర్సెలర్‌ మిట్టల్‌ నిప్పన్‌ స్టీల్‌ ప్లాంట్‌ భూమిపూజకు హాజరైనందుకు డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ సంతోషం వ్యక్తం చేస్తూ, చంద్రబాబు: రాజకీయ ప్రముఖుడు-పవన్‌ కల్యాణ్‌ ఆయనను ప్రశంసించారు.

Source link