seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 05 March 2026, 11:48 am Digital Edition : SEEMA KIRANAM

యుద్ధం ఎఫెక్ట్.. పెట్రోల్, డీజిల్ ధరలు పైపైకి..? భారత్ కు వార్నింగ్..! | అమితాబ్కాంత్ నీతి అయోగ్: ముడి చమురులో ప్రతి $10 పెరుగుదల భారతదేశ వార్షిక దిగుమతి బిల్లుకు $13-14 బిలియన్లను జోడిస్తుంది

అంతర్జాతీయ

ఓయ్-బొమ్మ శివకుమార్

<!--

--> <!--
Google Oneindia TeluguNews
-->

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు ఇప్పుడు తగ్గేలా లేవు. ఇరాన్, ఇజ్రేల్- అమెరికా మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. అయితే ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రపంచ ఇంధనానికి జీవనాడి అయిన హార్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముడి చమురు కొరత ప్రభావం భారత్‌తోపాటు, ప్రపంచ దేశాలపై తీవ్రంగా పడనుంది. ఇక భారత్ కు అవసరమైన ముడి చమురులో ఎక్కువ భాగం పశ్చిమాసియాలోని హర్మూజ్ జలసంధి ద్వారా వస్తుంది.

హార్మూజ్ జలసంధి మూసివేసిన భారత్ లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇదే విషయంపై నీతి ఆయోగ్ మాజీ మాజీ చీఫ్, మాజీ జీ20 కూటమి షెర్పా అమితాబ్ కాంత్ కీలక అంశాలను పరిశీలించారు. అంతర్జాతీయ మార్కెట్ లో ముడి చమురు ధరలు క్రమంగా పెరుగుతున్నాయని అన్నారు. ఈ కీలకంగా
ట్వీట్ చేశారు.

“భారీ ముడి చమురు ధరల్లో ప్రతి 10 డాలర్లు పెంచడం వల్ల భారత్ వార్షిక బిల్లుకు అదనంగా 13 నుంచి 14 బిలియన్ డాలర్ల భారం పడుతుంది. ఇది కరెంట్ అకౌంట్ లోటును పెంచి రూపాయి విలువపై ఒత్తిడి తెస్తుంది. ఇక భారత్ తదుపరి అడుగు కేవలం స్వచ్ఛమైన ఇంధన విద్యుత్తును పెంచడమే కాకుండా.. స్వచ్ఛమైన ఇంధన విద్యుత్తును అందించడం.. హైడ్రో స్టోరేజ్ అలాగే న్యూక్లియర్ వంటి స్థిరమైన తక్కువ-కార్బన్ బేస్ లోడ్ పద్ధతులు.. వీట పెరుగుదల ఇప్పుడు మనకు అవసరం.” అని ట్వీట్ చేశారు.

అమితాబ్‌కాంత్ నీతి ఆయోగ్ ప్రతి 10 క్రూడ్ ఆయిల్ పెరుగుదల భారతదేశ వార్షిక దిగుమతి బిల్లుకు 13-14 బిలియన్లను జోడిస్తుంది

ఇక గురువారం నాటికి చమురు ధరలు మరింతగా పెరిగాయి. 3 శాతం పెరుగుదలను నమోదు చేశాయి. ప్రస్తుతం చమురు ధర ఒక్కో బ్యారెల్ 84 డాలర్లకు చేరింది. గత 5 రోజులుగా చమురు ధరలు 20 శాతం పైగా ఎగబాకాయి. అలాగే గత 3 నెలల్లో 34 శాతం పెరిగాయి. అయితే పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో కేవలం 5 రోజుల్లోనే 20 శాతం ధరలు పెరిగాయి. యుద్ధం కారణంగా రానున్న రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరల్లో భారీ మార్పులు ఉండొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

అయితే ప్రస్తుతం భారత్ లో దేశీయ అవసరాలకు సరిపోయే విధంగా ముడి చమురు నిల్వలు ఉన్నాయి. మరో 6-8 వారాల వరకు సరిపోయేలా నిల్వలు ఉన్నాయని ప్రభుత్వం చెబుతోంది. అయితే దాదాపు సగం ముడి చమురు, ఎల్పీజీ దిగమతులు హార్మూజ్ జలసంధి నుంచే వస్తాయి. ఈ నేపథ్యంలో కొంత ఆందోళన వ్యక్తం అవుతోంది. ప్రస్తుత పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వం రోజూవారీ సమీక్షలు నిర్వహిస్తున్నామని ఓ సీనియర్ అధికారి స్పష్టం చేశారు.

Source link