భారతదేశం
ఓయ్-చంద్రశేఖర్ రావు
<!--
--> <!-- -->అమెరికా- ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య యుద్ధం తీవ్రరూపం దాల్చింది. దాదాపుగా గల్ప్ దేశాలన్నీ దీని వల్ల ప్రభావితం అయ్యాయి. సౌదీ అరేబియా మొదలుకుని బహ్రెయిన్ వరకూ ఏది మినహాయింపు కాదు. ఆయా దేశాల్లోని అమెరికన్ ఎయిర్ బేస్ స్టేషన్లు, రాయబార కార్యాలయాలను ఇరాన్ వదిలిపెట్టలేదు. వాటన్నింటిపైనా మిస్సైళ్ల వర్షాన్ని కురిపిస్తోంది. డ్రోన్లతో శక్తిమంతమైన బాంబులను జారవిడుస్తోంది.
ఈ పరిణామాలపై కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తాజాగా స్పందించారు. ప్రధాని నరేంద్ర మో ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణంపై ప్రభుత్వం మౌనం వహించడాన్ని తప్పు పట్టారు. మౌనంగా ఉండటం.. తటస్థ వైఖరి అనిపించుకోదని, బాధ్యతారాహిత్యమని అన్నారు. ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో ఓ కాలమ్ ను రాశారు సోనియగాంధీ. తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

ఖమేనీ మరణంపై భారత్ స్పందించకపోవడం అనేది ఆయన అసాసినేషన్‌కు పరోక్షంగా మద్దతు ఇచ్చినట్టే అవుతుందని సోనియా గాంధీ అభిప్రాయపడ్డారు. అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఖమేనీ హత్య చేసినట్లు ఇరాన్ ధృవీకరించిందని, చర్చలు జరుగుతున్న సమయంలో ఒక దేశాధినేతకు ఇలా జరగడం సమకాలీన అంతర్జాతీయ సంబంధాలపై తీవ్ర భంగం కలిగిస్తుంది. ఈ ఘటన షాక్ కంటే, భారత్ మౌనం.. మరింత దిగ్భ్రాంతిని కలిగిస్తోందని ఘాటుగా గుర్తించింది.
ఇరాన్ పై అమెరికా-ఇజ్రాయెల్ దాడిని విస్మరించిన ప్రధాని మోదీ దానికి ముందు జరిగిన సంఘటనల క్రమాన్ని ప్రస్తావించకుండా, యూఏఈపై ఇరాన్ ప్రతీకార దాడిని ఖండించడానికి పరిమితం అయ్యారని గుర్తు చేశారు. ‘చర్చలు, దౌత్యం’ అంటూ ఏవేవో మాట్లాడారని గుర్తు చేశారు. ఒక విదేశీయుడు హత్యను ప్రశ్నించకపోవడం, సార్వభౌమాధికారాన్ని లేదా అంతర్జాతీయ చట్టాన్ని స్పష్టంగా సమర్థించకపోవడం, నిష్పాక్షికతగా వ్యవహరించకపోవడం అనేది దేశ విదేశాంగ విధానం విశ్వసనీయతపై సందేహాలను లేవనెత్తుతుందని అన్నారు.
హత్యకు 48 గంటల ముందు, ప్రధాని ఇజ్రాయెల్ పర్యటన నుండి తిరిగి వచ్చారని, గాజా సంఘర్షణలో పౌర మరణాలపై, ముఖ్యంగా అనేక మంది మహిళలు, పిల్లలపై ప్రపంచవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతున్నప్పటికీ, ఆయన బెంజమిన్ నెతన్యాహు ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతును పునరుద్ఘాటించారని సోనియా గాంధీ తెలిపారు. గ్లోబల్ సౌత్‌లోని చాలా దేశాలు పాటించిన తరుణంలో నైతిక స్పష్టత లేకుండా భారత్ ఓ ఉన్నత స్థాయి రాజకీయ మద్దతు ఇవ్వడం ఆందోళన కలిగించేదని పేర్కొన్నారు.
ఆంగ్ల సారాంశం
ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హత్య తర్వాత మౌనంగా ఉన్న మోడీ ప్రభుత్వంపై సోనియా గాంధీ నిప్పులు చెరిగారు. భారత ప్రభుత్వం హత్యను ఖండించడం లేదా ఇరాన్ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించడం మానుకుంది, ఆమె పేర్కొన్నారు.